లండన్‌లో కాంగ్రెస్ ఆరు నూరు కార్యక్రమం..!
లండన్: ఆరు గ్యారంటీ పధకాలు -నూరు గ్యారంటీ సీట్ల లక్ష్యం తో టీపీసీసీ ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లండన్ లో ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పాల్గొని ఎన్నారై లకు ఎన్నికల దృష్ట్యా మార్గదర్శకం చేశారు.
కాంగ్రెస్ పార్టీ యువత, మహిళ, రైతుకి ఇవ్వబోయే వివిధ సంక్షేమ పధకాలను వివరించారు. విద్యార్థుల కోసం రూ.5 లక్షల ATM కార్డు, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వం లోకి రాగానే మెగా DSC ఏర్పాటు చేసి, ఏక కాలం లో భారీ సంఖ్య లో ఉద్యోగ భర్తీ నింపడం వంటి పధకాలు వివరించారు.

గల్ఫ్ సంక్షేమం బోర్డు మరియు ఎన్నారై సెల్ ఏర్పాటు పై మేనిఫెస్టో లో పొందుపరిచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో కో కన్వీనర్ లు రంగుల సుధాకర్ గౌడ్, రాకేష్ బిక్కుమండ్ల, మంగళారపు శ్రీధర్ అడ్వైజరరీ బోర్డు సభ్యులు గంగసాని ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి శ్రీధర్ నీలా, మహిళా విభాగం కో ఆర్డినేటర్ మేరీ, టీపీసీసీ ఎన్నారై సెల్ సభ్యులు శ్రీనివాస్, అజయ్, కళ్యాణ్, సయ్యద్, సాయి, తదితరులు 50 మంది సభ్యులు పాల్గొన్నారు.రాబోయే ఎన్నికల్లో 6 గ్యారంటీ పధకాలతో ప్రజల్లోకి వెళ్లి 100 సీట్లు గెలిచే లక్ష్యం తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల కావడం, రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించడంతో హస్తం పార్టీలో జోష్ కనిపిస్తోంది. తెలంగాణ దొరల రాజ్యమైందని నవంబర్ 30న జరగనున్న ఎన్నికలు దొరల పాలనకు ప్రజాపాలనకు మధ్య జరుగుతున్నవని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications