హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లండన్‌లో తెలంగాణ బోనమెత్తిన స్వామిగౌడ్(వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి సుమారు 700లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరైయ్యారు.

ఈ వేడుకలకు తెలంగాణా రాష్ట్రం నుండి తెలంగాణా మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తోట్టెల ఊరేగింపు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్ధానికులను కూడా ముగ్దులని చేసింది.

Council Chairman Swamy Goud at TeNF Bonalu Celebrations

ఈ సంవత్సరం జరుపుకొనే పండగకు ప్రత్యేకత ఉందని తెలంగాణ రాష్ట్ర పండగగా కొత్త ఉత్సాహాన్ని, స్పూర్తినిచ్చాయని, తెలంగాణా మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ మా ఆహ్వానాన్ని మన్నించి లండన్ విచ్చేసి మా ఆడబిడ్దలతో పాటు బోణం ఎత్తుకోవడం మాకెంతో స్పూర్తినిచ్చిందని కమిటీ సభ్యులు, హాజరైన ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలిపారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం మూడు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు. ఇది చూసి హాజరైన ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి లోనయ్యారు. బోనాల ఊరేగింపు తర్వాత ఏర్పాటు చేసిన వేడుకల సభలో తెలంగాణ మండలి ఛైర్మన్ శ్రీ స్వామి గౌడ్ మాట్లాడారు.


ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని అన్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో తెలంగాణా ఎన్నారై ఫోరం లండన్ వీధుల్లో "జై తెలంగాణ" అంటూ చేసిన పోరాటం మాకు ఎంతో స్పూర్తినిచ్చిందని అన్నారు. ఈ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా రాష్ట్రంలో ఉనట్టుగా అనిపించిందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరుని ప్రశంసించారు.

ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు బిజీగా ఉన్నపట్టికి, బాధ్యత కలిగిన తెలంగాణ బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు తెలంగాణ పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర నాకు ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు. ఖండాంతరాల్లోఉంటూ తెలంగాణా పేద బిడ్దలను, అనాధలను, వికలాంగుల బిడ్డలకు చేస్తున్న ఆర్థిక సహాయం వెల కట్టలేనిదని తెలిపారు.


తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ ప్రజల ఆకాంక్షాల మేరకు, మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ పథకాల గురించి వివరించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెతుందని కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు, సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా నన్ను కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. ప్రతి తెలంగాణా బిడ్డ మిషన్ కాకతీయలో బాగాస్వామం కావాలని పిలుపునిచ్చారు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో, నేడు పునర్నిర్మాణంలో వారి మాతృ భూమికి చేస్తున్న సేవలకు, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినిధులు స్వామి గౌడ్‌‌ని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అద్యక్షులు సిక్కా చందు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో స్వామి గౌడ్ పాత్రను, చేసిన పోరాటాలను గురించి సభకు వివరించారు.

పిలవగానే వచ్చి ఈ బోనాల వేడుకల్లో మాతో పాటు బాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ ఎన్నారై ఫోరమ్ తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డలా కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరూ ఇందులో బాగస్వాములు కావాలని పిలుపున్నిచ్చారు.

తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాఘం సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమం అందరిని అలరించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీకై నిర్వహించిన రాఫెల్‌లో అందరు పాల్గొని విజేతలు బంగారం బహుమతులు గెల్చుకున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ జ్ఞాపికలతో ప్రశంశించారు.

సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తల్పించందని పలువురు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గంగాసాని, మంద సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం అద్యక్షులు సిక్కా చందు గౌడ్, తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలంతో పాటు ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ప్రదాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, అడ్వైసరి బోర్డు ఛైర్మన్ ఉదయ నాగరాజు, సంయుక్త కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఈవెంట్స్ ఇంచార్జ్ నగేష్ రెడ్డి, ఈవెంట్స్ సెక్రటరీ శ్వేతా రెడ్డి, అడ్వైసరి బోర్డు సబ్యులు ప్రమోద్ అంతటి, మహిళా విభాగం సబ్యులు అర్చన జువ్వాడి, మీనాక్షి , సుమ, స్వాతి, వాణి, నిర్మల, శుశుమ్న, దీప్తి ఇతర కమిటీ సబ్యులు శ్రీధర్, రోహిత్ రేపక,అశోక్ గౌడ్,నవీన్ రెడ్డి, రత్నాకర్ , హరి గౌడ్ నవపేట్, మల్లరెడ్డి, విక్రం రెడ్డి, నరేష్, రంగు వెంకట్, శివాజీ షిండే, శ్రీకాంత్ జెల్ల, ఆక్రం, శ్రీనివాస్ రుద్ర చిట్టి వంశీ, సందీప్ గౌడ్, శ్రీధర్ రావు, స్వదేశం నుండి వచ్చిన కరీంనగర్ టీఆర్ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి కాసార్ల తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

English summary
Council Chairman Swamy Goud at TeNF Bonalu Celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X