ఆటా ఆధ్వర్యంలో మిల్ వాకీ టీం, మిల్ వాకీ చాంపియన్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం(ATA-ఆటా) ఆధ్వర్యంలో మిల్ వాకీ టీం, మిల్ వాకీ చాంపియన్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అంగరంగ వైభవంగా దాదాపు 4 నెలలుపైగ నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో ఎనిమిదికిపైగా టీంలు పాల్గొన్నాయి.

సెప్టెంబర్ 24,2023 తేదిన నిర్వహించిన ఫైనల్స్‌లో విజేతలకు ఆల్డర్ వుమన్ మరీనా దిమ్మెట్రీజెవిక్ ట్రోఫీ ప్రధానం చేశారు. ఆటా విస్కాన్సిన్ రీజినల్ కో-ఆర్డినేటర్లు పోలిరెడ్డి గంటా, చంద్ర మౌళి సరస్వతి, స్థానిక కోఆర్డినేటర్ కరుణాకర్ రెడ్డి దాసరి, మహిళా సమన్వయకర్తలు సింధు, కావ్య, జీవిత,స్థానిక మీడియా కో-ఆర్డినేటర్ జయంత్ పారా, లోకల్ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ రబ్బా, లోకల్ స్టూడెంట్ కో-ఆర్డినేటర్ ప్రణీత్ పి, టీమ్ సభ్యులు పావని, శ్రావణి, లోహిమ, రోజా, గోపాల్, రాజబాబు, రాజ్ సాహు ఉన్నారు.

ఆటా అధ్య క్షురాలు మధు బొమ్మినేని, ఎగ్జిక్యూటివ్ టీం కార్యవర్గ సభ్యులకు, మీడియా సహకారం అందించిన మీడియా టీం మెంబెర్స్ అనిల్ బొద్దిరెడ్డి, భాను స్వర్గం, నిరంజన్ పొద్దుటూరి, శీతల కి ధన్యవాదాలు తెలియచేశారు.












Click it and Unblock the Notifications