కాన్ఫరెన్స్: భారీగా నిధులు సేకరించిన తానా(పిక్చర్స్)
న్యూయార్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా(తానా) భారీ స్థాయిలో నిధులను సేకరించి రికార్డు సృష్టించింది. తానా 20వ కాన్ఫరెన్స్(జులై 2-4, 2015) కోసం శనివారం ఫర్మింగ్టన్ శివారులోని డెట్రాయిట్‌లో నిధుల సేకరణ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నవారి నుంచి ఒకే రోజులో 1.6 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.
కాన్ఫరెన్స్ కన్వీనర్ గంగాధర్ నాదెళ్ల, అధ్యక్షుడు మోహన్ నన్నపనేని నేతృత్వంలో ఈ నిధుల సేకరణ జరిగింది. 600మందికి పైగా తెలుగు ప్రవాసులు, 50మందికి పైగా తానా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మజా గద్దె జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చౌదరి జంపాల, బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి, తానా ఫౌండేషన్ ఛైర్మన్ జయశేఖర్ తాళ్లూరి, మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, ఫౌండేషన్ సెక్రటరీ శ్రీనివాస రావు గోగినేని, కోశాధికారులు మధు టాటా, సాగర్ మలిశెట్టి, తానా నాయకులు డా. హేమా ప్రసాద్ యెడ్ల, సుబ్బారావు కోళ్ల, అంజయ్య చౌదరి లావు, యుగంధర్ యడ్లపాటి, నిరంజన్ శృంగవరపు, హరీశ్ కోయ, శ్రీనివాస్ జరుగుల, పూర్ణ వీరపనేని, వసుదేవ రెడ్డి చిన్నా, హేమ కనురు, జోగేశ్వరరావు పెద్దిబోయిన, రవి పొట్లూరి, గౌతం గుర్రమ్, రాజేష్ అడుసుమిల్లి, రావు యెలమంచిలిలను కార్యదర్శి సతీష్ వేమన సమావేశానికి పరిచయం చేశారు.
తానా 20వ కాన్ఫరెన్స్ కోసం వచ్చిన డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్(డిటిఏ), ఇతర తెలుగు ప్రవాసులకు మోహన్ నన్నపనేని కృతజ్ఞతలు తెలిపారు. తానా, తానా ఫౌండేషన్, తానా టీం సేవలకు ప్రవాసుల నుంచి వచ్చిన స్పందనకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, సిపిఐ నాయకుడు నాగేశ్వరరావు ముప్పళ్ల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. హుధుద్ తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం తానా తనవంతుగా కృషి చేయడాన్ని వారు అభినందించారు. వచ్చే ఏడాది జరుగనున్న కాన్ఫరెన్స్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

తానా నిధుల సేకరణ
తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా(తానా) భారీ స్థాయిలో నిధులను సేకరించి రికార్డు సృష్టించింది.

తానా నిధుల సేకరణ
తానా 20వ కాన్ఫరెన్స్(జులై 2-4, 2015) కోసం శనివారం ఫర్మింగ్టన్ శివారులోని డెట్రాయిట్‌లో నిధుల సేకరణ జరిగింది.

తానా నిధుల సేకరణ
ఈ సమావేశంలో పాల్గొన్నవారి నుంచి ఒకే రోజులో 1.6 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.

తానా నిధుల సేకరణ
కాన్ఫరెన్స్ కన్వీనర్ గంగాధర్ నాదెళ్ల, అధ్యక్షుడు మోహన్ నన్నపనేని నేతృత్వంలో ఈ నిధుల సేకరణ జరిగింది.

తానా నిధుల సేకరణ
600మందికి పైగా తెలుగు ప్రవాసులు, 50మందికి పైగా తానా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మజా గద్దె జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఉదయ్‌కుమార్ చపలమడుగు కార్యక్రమానికి హాజరైన వారి నుంచి నిధులను సేకరించారు. గంటన్నరపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు భారీ ఎత్తున నిధులను సమకూర్చారు. 1.6 మిలియన్ డాలర్లను వారు అందజేశారు. కాన్ఫరెన్స్ కోసం తానా సభ్యులు కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, వర ప్రసాద్ పొట్లూరిలు లక్ష డాలర్ల చొప్పున అందజేశారు.
దుర్గా ప్రసాద్ గద్దె 51,116 డాలర్లు, ఎన్‌టి చౌదరి $50,000 డాలర్లు, శ్రీనివాసన్ గోనుగుంట్ల, నవీన్ యేర్నేని, వినోద్ కుకునూర్‌లు 25,000 డాలర్ల చొప్పున విరాళాలు అందజేశారు. తానా నాయకులు 470,000 డాలర్లను అందించారు. విరాళాలు అందించిన ప్రవాసులకు, డిటిఏకు గంగాధర్ నాదెళ్ల, మోహన్ నన్నపనేని, నిధుల సేకరణ కమిటీ ఛైర్మన్ సురేష్ పుట్టగుంట, ఉపాధ్యక్షుడు నవీన్ యేర్నేని కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించబోయే 20వ కాన్ఫరెన్స్ గొప్ప అనుభవాన్ని ఇస్తుందని గంగాధర్ తెలిపారు.
కార్యక్రమంలో శ్రీవాణి కోనేరు, శ్రీనివాస రాజు, సునీల్ కోనేరు, మనోరమ గొంధి, నరహరి కొడాలి, శివాజీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. యువ గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవిలు పాడిన గీతాలు ఆకట్టుకున్నాయి. మిమిక్రీ కళాకారుడు రమేష్ నవ్వులు పూయించారు. తానా కాన్ఫరెన్స్ సెక్రటరీ శ్రీనివాసరావు గోగినేని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
సతీష్ చిలుకూరి, జయరాం కోమటి, డా. హనుమయ్య బండ్ల, మురళీ వెన్నం, చలపతి కొండ్రకుంట, జయశేఖర్ తల్లూరి, సతీష్ వేమన, జోయ్ పెద్దిబోయిన, డిటిఏ అధ్యక్షుడు వేణు సురపరాజు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసన్ గోనుగంట్ల, ద్వారకా ప్రసాద్ లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications