NRI News: కెనడాలోని ఎన్నారైలకు శుభవార్త చెప్పిన భారత ప్రభుత్వం..
కెనడాలో ఉంటున్న ఎన్నారైలకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వం త్వరలో కెనడాలో 2 కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించబోతోంది. గత కొన్ని నెలలుగా కెనడా, భారత్ మధ్య కొనసాగుతోంది. అయితే ఈ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వీసాలను పునరుద్ధరించింది. తాజాగా కెనడాలో రెండు కొత్త భారత కాన్సులేట్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హతమైన తర్వాత భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
నోవా స్కోటియా ప్రాంతం కోసం మిస్సిసా, హాలిఫాక్స్‌లో ఈ కొత్త కాన్సులేట్‌లు ప్రారంభించనున్నారు. కెనడాలోని కొత్త రాయబార కార్యాలయాలు జనవరి 1, 2024 నుంచి పనిచేయనున్నాయి. ఈ కేంద్రాలలో వీసా, పాస్‌పోర్ట్ నుండి OCI వరకు సౌకర్యాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు టొరంటోలోని భారత రాయబార కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇద్దరు అనుమానితుల్ని కెనడా పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. వారిద్దరిని తర్వలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిజ్జర్ హత్యతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితులపై గత కొన్ని నెలలుగా కెనడా పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ వార్త కథనలు పేర్కొంటున్నాయి.
భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్ లో హత్యకు గురయ్యాడు.
కెనడా లోని సర్రే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అతను మృతి చెందాడు. నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ టార్గెట్ ఆరోపణలు చేశారు. దీంతో భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ సంబంధాలు క్రమంగా పుంజుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications