NRI News: ఆటా ఆధ్వర్యంలో గిరిజనులకు సాయం..
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవుల సమీపంలోని గిరిజన ప్రాంతం దోమలపెంట హై స్కూల్ లో బ్రహ్మగిరి సేవా సొసైటీ వారి సంవంట సహకారంతో సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ATA(American Telugu Association) అధ్యక్షులు జయంత్ చల్లా పాల్గొన్నారు. పేదలకు సహాయం చేయడంలో ఆనందం ఉంటుందన్నారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ సిస్టమ్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్ కు మొత్తం 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
గిరిజనులకు వారికి వైద్య సేవలు అందేలా GOR Seva Club తో సమన్వయం చేయనున్నారు. అలాగే మన్ననురు రేంజ్ కు చెందిన భోగాపుర్ గ్రామంలో చెంచు గిరిజన ప్రాంతాలను ఆటా టీమ్ సందర్శించింది. గిరిజనులతో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సహాయం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆటా పాలుపంచుకుంటుందని జయంత్ అన్నారు.

ఇక్కడి గిరిజనులకు సేవ కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ తో చర్చించామని జయంత్ చెప్పారు. ప్రభుత్వం తరుపున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరినట్లు వివరించారు. గిరిజనులు తమను స్వాగతించిన తీరు నిజంగా అభినందనీయమన్నారు. ఇక్కడి వారికి ఇంకేమైనా సహాయం కావాలన్నా ఆటా తరుపున చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో ఛైర్మన్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కర్ల, స్థానిక కో ఆర్డినేటర్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications