మహిళపై రేప్: ఎన్నారై అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం.. వెంకటేష్ కోదండప్ప జ్యోతిష్యం చెప్పుకుంటూ ఆస్ట్రేలియాలో జీవనం సాగిస్తున్నాడు. అయితే బాధిత ఆస్ట్రేలియన్ మహిళ గత జనవరిలో అతని వద్దకు జ్యోతిష్యం చెప్పించుకునేందుకు వెళ్లింది. తన వద్దకు వచ్చిన మహిళకు ఏవో దుష్టశక్తులు ఆవహించాయని చెప్పి ఆమెను నమ్మించాడు వెంకటేష్.
అనంతరం ఆమెను తన కార్యాలయానికి రప్పించుకున్న వెంకటేష్ కోదండప్ప ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కొత్త వారితో శృంగారం జరిపితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆ జ్యోతిష్కుడు మాయమాటలు చెప్పాడని, వాటిని రెండు సార్లు తిరస్కరించినా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళ.. పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొంది.
కాగా నిందితుడైన వెంకటేష్ కోదండప్పపై ఎనిమిది ఛార్జీ షీట్లు దాఖలు కావడంతో పోలీసులు అతన్ని మెల్‌బోర్న్ కోర్టులో శుక్రవారం ప్రవేశపెట్టారు. మాయమాటలు చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కోర్టుకు బాధిత మహిళ వివరించగా.. ఆ మహిళ కక్ష కట్టి తనపై ఆరోపణలు చేస్తోందని, తాను ఎటువంటి తప్పు చేయలేదని వెంకటేష్ కోదండప్ప కోర్టుకు తెలిపాడు.












Click it and Unblock the Notifications