వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో ఇంగ్లీష్ అన్నందుకు చితకబాదారు

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా పోలీసులు జరిపిన దాడిలో భారతీయ పౌరుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 6 తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలబామాలోని హంట్స్‌విల్లేలో ఉంటున్న తన కుమారుడి వద్దకు రెండు వారాల క్రితమే బాధితుడు గుజరాత్‌కు చెందిన సురేశ్‌భాయ్ పటేల్ వచ్చాడు.

గతవారం తన ఇంటినుంచి బజారుకు వచ్చిన సురేశ్‌ను పోలీసులు అడ్డగించి ప్రశ్నించారు. అయితే నో ఇంగ్లీష్ అంటూ భాష తెలియదని సమాధానమిస్తూ జేబులో చేతులు పెట్టుకున్నారు. దీంతో బెదిరిపొయిన పోలీసులు సురేశ్ ము ఖాన్ని బలంగా నేలకేసి బాదడంతో ఆయన పాక్షికంగా గాయపడ్డారు. ఈ విషయంపై సురేశ్ కుమారుడు చిరాగ్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Indian national attacked in USA

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మాడిసన్ పోలీస్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు దాడికి బాధ్యులైన సిబ్బందిని సెలవుపై వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

ముగ్గురు ముస్లిం యువకుల కాల్చివేత: పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవ కారణంగా అమెరికాలోని నార్త్ కరోలినాలో ముగ్గురు ముస్లింలను కాల్చి చంపారు. క్రేగ్ స్టిఫెన్ అనే వ్యక్తి కారు పార్కింగ్ విషయలో గొడవపడి దియా బరాకత్ (23), యూసర్ అబు సల్హా(2), అబూ సల్హా(19)లపై కాల్పులు జరిపాడని బుధవారం స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు.

English summary
A man from gujarat has been attacked in USA by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X