భారతీయుడిపై కాల్పులు: తీవ్రగాయాలు
మనీలా: భారత సంతతికి చెందిన ఓ యువకుడిపై సాయుధులైన ఇద్దరు దుండగులు బైకుపై వెళుతూ తుపాకులతో కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన ఫిలిప్పీన్స్‌లోని జంబోంగ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. రెండు సార్లు కాల్పులు జరపడంతో అతడి తలకు, శరీరానికి బుల్లెట్ల గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
సుఖ్జిందర్ సింగ్(28) తన ఇంటి నుంచి కజిన్ ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, గత సంవత్సరంలో కూడా ఆ ఇద్దరు ఫిలిపినో దొంగలు జంబోంగాలో ఓ చిన్న వ్యాపారం చేసుకుంటున్న భారత వ్యాపారి హర్పీత్‌పై దాడి చేశారని పోలీసులు తెలిపారు.

కాగా, 2012, అక్టోబర్‌లో తావి తావి ప్రావీన్స్ నుంచి వచ్చిన ఐదుగురు భారతీయులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద పాస్‌పోర్టులు లేవని, వారి వద్ద ఉన్నవి కేవలం నకిలీ లేబర్ పర్మిట్లు మాత్రమేనని చెప్పారు.
జంబోంగాలో స్థిరపడిన చాలా మంది భారతీయులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. మరికొంత మంది స్థానిక యువతులను వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడిపోయారని చెప్పారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications