ఐసీఎస్‌యూ అధ్యక్షుడిగా దయారెడ్డి ఎన్నిక
జోహెన్నెస్‌బర్గ్: అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర మండలి (ఐసీఎస్‌యూ) అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి దయారెడ్డి ఎన్నికయ్యారు. 120 దేశాల సభ్యులు, సైన్సు సంఘాలకు చెందిన ప్రతినిధులు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్‌లో జరిగిన సమావేశంలో భారత - దక్షిణాఫ్రికా సంతతికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు దయారెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్బంలో దక్షిణాఫ్రికా సైన్సు అండ్ టెక్నాలజీ మంత్రి నేలడి ఫండర్ దయాకర్ రెడ్డిని అభినందించారు.
ఇక దయారెడ్డి విషయానికి వస్తే కేట్‌టౌన్ విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పట్టా, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ డిగ్రీ పొందారు. ప్రస్తుతం దయాకర్ రెడ్డి దక్షిణాఫ్రికా సైన్స్ అకాడమీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

అనువర్తిత గణిత శాస్త్రం, ఇంజనీరింగ్‌లో పలు రకాల పరిశోధనలు చేశారు. ప్రభుత్వేతర సంస్ద అయిన అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర మండలిలో ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాలు, 31 అంతర్జాతీయ సైన్సు సంఘాలు సభ్వత్వాన్ని కలిగి ఉన్నాయి.












Click it and Unblock the Notifications