NRI News: కెనడాలో భారతీయ విద్యార్థిపై కాల్పులు..
కెనడాలో భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎడ్మాంటన్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని కాల్చి చంపారు. పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. హర్షన్‌దీప్ సింగ్ అనే విద్యార్థి చదువుకుంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇవాన్ రైన్, జుడిత్ సాల్టియాక్స్ హర్షన్ దీప్ సింగ్ కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఒక అపార్ట్‌మెంట్ భవనం వద్ద తుపాకీ కాల్పులు జరిగినట్లు సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే హర్షన్ దీప్ సింగ్ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు సభ్యుల ముఠా కాల్పులు జరిగినట్లు సీసీ టీవీ వీడియోలో రికార్డు అయింది. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. "డిసెంబర్ 6 శుక్రవారం సుమారు 12.30 గంటలకు, 106 స్ట్రీట్, 107 అవెన్యూ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ భవనంలో తుపాకీ కాల్పులు జరిగినట్లు వచ్చిన నివేదికపై పెట్రోలింగ్ అధికారులు స్పందించారు. అక్కడికి చేరుకుని భాదితుడిని 20 ఏళ్ల మగ సెక్యూరిటీ గార్డును గుర్తించారు. హర్షన్‌దీప్ సింగ్ వెంటనే స్పందించి చికిత్స అందించి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే అతను అప్పటికే మరణించినట్లు పోలీసులు చెప్పారని" అని ఎడ్మంటన్ పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు తాము నమ్మడం లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. అరెస్టు సమయంలో ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.హత్య వెనుక గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కెనడాలో గతంలో కూడా భారతీయ విద్యార్థులు హత్యకు గురయ్యారు. నెల రోజుల క్రితం వాక్ ఇన్ అవెన్ లో పడి భారత సంతతికి చెందిన మహిళ గుర్‌సిమ్రత్ కౌర్ మృతి చెందింది. సహోద్యోగి ఒకరు ఆమెను అవెన్‌లోకి తోసేసి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. కానీ ఆ తర్వాత అది నిజం కాదని తెలిసింది.












Click it and Unblock the Notifications