NRI News: హ్యూస్టన్ లో జనసేన విజయభేరి సంబరాలు..

అమెరికాలోని హ్యూస్టన్ జనసైన్యం జనసేన విజయభేరి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ విజయోత్సవ వేడుకలకు సుమారు మూడు వందలకు పైగా హ్యూస్టన్ జనసేన కార్యకర్తలు, వీరమహిళలు వచ్చారు. జనసేన జెండాను ఎగరేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీరెవరు తాలుకా, డిప్యుటీ CM గారి తాలుకా, బాబులకే బాబు కల్యాణ్ బాబు, మనల్నెడ్రా ఆపేది, జై జనసేన, జై కూటమి, జై టిడిపి, జై ఎన్డిఏ వంటి నినాదాలు చేశారు. అంతుకు ముందు సుమారు వందకు పైగా కార్ల తో ర్యాలీ తీశారు.

కల్యాణ్ చివుకుల గారి రేంచ్ హౌస్ నుంచి మొదలైన ఈ కారు ర్యాలీ కోలాహలంగా సాగింది. డిప్యుటీ CM గారి తాలుకా కార్ స్టిక్కర్లు, జనసేన పార్టీ జెండాల కార్ల ర్యాలీ కొనసాగింది. పదిమైళ్లకు పైగా సాగిన కారు ర్యాలీ సభాస్థలి లుంబ్రే క్లబ్ వరకు కొనసాగింది. జనసేన పార్టీ సాంగ్ ప్లే చేయడంతో అందరు డ్యాన్స్ చేశారు. యాళ్లబండి రాజేష్ జనసైనికులకు స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంబించారు. జనసేన హ్యూస్టన్ ప్రయాణాన్ని ఈ పది సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పారు.

Janasena Vijayabheri celebrations were held in Houston

2019 ఎన్నికలకు 19 నియోజకవర్గాలను దత్తత తీసుకుని కార్యకర్తలు, నాయకులు, శాసనసభ అభ్యర్ధులతో పనిచేసినట్లు చెప్పారు. ఈ ఎన్నికలలో అభ్యర్థులందరితోను నియోజకవర్గ స్థాయిలో పనిచేయడం, 2018 డల్లాస్ లో జరిగిన కళ్యాణ్ ప్రవాసగర్జన ను గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో
జనసేన 21 స్థానాల్లో విజయదుంధుభి మోగించిందన్నారు. శాసన సభ్యులను, ఇద్దరు పార్లమెంట్ సభ్యులనూ అభినందించారు. క్షేత్రస్థాయిలో పనిచేసి మన శాసనసభ నియోజకవర్గాల్లో కూటమి నాయకులను గెలిపించుకోవడానికి హ్యూస్టన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన వారిని అభినందించారు.

ఏపీకి వెళ్లిన వారిలో మోసర్ గంగాధర్ (వైజాగ్ వెస్ట్), సత్తి సురేష్ (పోలవరం), క్రిష్ణ (గాజువాక), సాయి రాజ్ (మచిలిపట్నం) ఉన్నారు. ప్రధాని నరెంద్ర మోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీకి, రాష్ట్రాభివృద్ధికీ NRI ల తరుపున తన సంపూర్ణ సహకారాన్ని అందించడానికి సంసిద్దత వ్యక్తంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+