దుబాయ్‌లో రాష్ట్రవాసి ఆత్మహత్య

 A Man from India commit suicide in Dubai
దుబాయ్: జీవనోపాధి కోసం దుబా‌య్‌ దేశానికి వెళ్లిన రాష్ట్రవాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని నిజామాబాద్ మండలం కంజర్ గ్రామానికి చెందిన దుంపల శ్రీను (30) ఆత్మహత్య చేసుకున్నాడు. రెండున్నర ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న శ్రీను మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి తిరిగి దుబాయ్‌కి వెళ్లాడు.

కాగా మూడు రోజుల క్రితం శ్రీను తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు ఉంటున్న తన గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శ్రీను కుటుంబ సభ్యకులకు విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురై కన్నీరుమున్నీరయ్యారు. కాగా శ్రీను ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

దుబాయ్‌లో భారతీయుని అరెస్ట్

దుబాయ్‌లోని షార్జా అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారు బిస్కట్లను తరలిస్తున్న ఓ భారతీయుడ్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 12 బంగారు బిస్కెట్లను భారతదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

నిందితుడు అధికారులను మోసం చేయాలని చూశాడని షార్జా పోలీసులు తెలిపారు. 12 బంగారు బిస్కెట్లతోపాటు రెండు బ్రాస్‌లెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నాడని చెప్పారు. పన్ను చెల్లించకుండా 699 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని నిందితుడు తన దేశానికి తరలించాలని ప్రయత్నించాడని తెలిపారు. తమ దేశ చట్టాలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించొద్దని అక్కడి పోలీసులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+