వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మీట్ అండ్ గ్రీట్ విత్ కడియం శ్రీహరి’(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

లండన్: ఎన్నారై టిఆర్ఎస్ సెల్ తెలంగాణా ఎన్నారై ఫోరమ్(టిఈఎన్ఎఫ్), తెలంగాణ జాగృతి-యూకే సంయుక్తంగా లండన్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి భారీగా వివిధ సంస్థల కార్యకర్తలు, తెలంగాణావాదులు హాజరయ్యారు.

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ కార్యదర్శి నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, దివంగత ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణా గీతం జయ జయహే తెలంగాణాతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ తెలంగాణా ఎన్నారై ఫోరం నాలుగు సంవత్సరాల్లో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని అన్నారు. బంగారు తెలంగాణా నిర్మాణ దిశగా టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వివరించారు.

తను లండన్‌లో గత కొన్ని రోజులుగా హాజరైన అధికారిక కార్యక్రమాల గురించి వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ కలుపుకొని, అందరి సూచనలని తీసుకొని ముందుకు వెళుతోందని అన్నారు. అందుకే ఎన్నారైలు కూడా ఎటువంటి సలహాలైనా లేదా సందేహాలు ఉన్నా వ్యక్తిగతంగా తనను కానీ, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కానీ సంప్రదించవచ్చని తెలిపారు.

మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని, అందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదని అన్నారు. ప్రత్యేకించి విద్యా రంగంలో తీసుకున్న నిర్ణయాలు-విధానాల గురించి సభకు వివరించారు. భవిష్యత్తులో ఎన్నారైలను భాగస్వాములుగా చేసుకొని విద్యా రంగంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టలనుకుంటున్నామని చెప్పారు. అందుకు అందరు సహకరించి, అందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జీహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నారై టిఆర్ఎస్ అధక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు కడియం శ్రీహరికి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై టిఆర్ఎస్ సెల్‌కి ఎప్పటికప్పుడు కెసిఆర్, యావత్ టిఆర్ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు.

కెసిఆర్ ఆదేశాల మేరకు పునర్నిర్మాణంలో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రవాస బిడ్దలందరూ.. హైదరాబాద్‌లో నివసించే వారి బంధువులు, మిత్రులని టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాలని కోరారు.

తెలంగాణ ఎన్నారై ఫోరమ్ఉపాధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన లో నేడు పునర్నిర్మాణంలో లండన్‌లోని తెలంగాణ ఎన్నారై ఫోరమ్ పాత్రని వివరించారు. తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకించి ఎన్నారై విభాగాన్ని త్వరలో ప్రారంభించాలని కడియం శ్రీహరిని కోరారు.

జాగృతి యూకే అధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ.. సంస్థ ఆవిర్భావం నుంచి చేస్తున్న కార్యక్రమాలని, భవిష్యత్తు కార్యక్రమాల గురించి సభకు వివరించారు. చివరిగా వివిధ సంస్థల కార్యవర్గ సభ్యులు ప్రత్యేకంగా కడియం శ్రీ హరిని సన్మానించి, జ్ఞాపిక బహూకరించారు. కడియం శ్రీ హరి వచ్చిన అతిథులని వ్యక్తిగతంగా వెళ్లి కలిసి పలకరిస్తూ సందడి చేశారు. వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, సెక్రెటరీలు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యూకే ఇంఛార్జ్ విక్రం రెడ్డి, శ్రీధర్రావు, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్, తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఉపాద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, అడ్వైజరి బోర్డు చైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, ఈవెంట్స్ ఇంఛార్జ్ నగేష్ రెడ్డి, జాగృతి -యూకే ఉపాధ్యక్షులు సుమన్ రావు బల్మూరీ. జీయార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, వినయ్ కుమార్ ఆకుల, సత్య, సృజన్ రెడ్డి చాడా, సతీష్ బండ, సెరు సంజయ్, మధు సూధన్ రెడ్డి, రాజేష్ వర్మ, సుమ దేవి, శ్వేతా, మీనాక్షి అంతటి, రంగు వెంకట్, స్వాతి, సురేష్, వాణి, నరేశ్, సంతోష్, శ్రావాణ్ రెడ్డి, పావని కతి, కీషోర్ మునుగాల, గణేశ్,
ప్రశాంత్, సాయి రెడ్డి, సలాం ఫరూక్ హాజరైన వారిలో ఉన్నారు.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ తెలంగాణా ఎన్నారై ఫోరమ్(టిఈఎన్ఎఫ్), తెలంగాణ జాగృతి-
యూకే సంయుక్తంగా లండన్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి భారీగా వివిధ సంస్థల కార్యకర్తలు, తెలంగాణావాదులు హాజరయ్యారు.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ కార్యదర్శి నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. ముందుగా
అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, దివంగత ప్రొఫెసర్ జయశంకర్‌కు నివాళులర్పించారు.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

ఆ తర్వాత తెలంగాణా గీతం జయ జయహే తెలంగాణాతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

ఎన్నారై టిఆర్ఎస్ సెల్ తెలంగాణా ఎన్నారై ఫోరం నాలుగు సంవత్సరాల్లో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని అన్నారు. బంగారు తెలంగాణా నిర్మాణ దిశగా టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వివరించారు.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

తను లండన్‌లో గత కొన్ని రోజులుగా హాజరైన అధికారిక కార్యక్రమాల గురించి వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ కలుపుకొని, అందరి సూచనలని తీసుకొని ముందుకు
వెళుతోందని అన్నారు.

English summary
Meet and Greet with TS Deputy CM Kadiyam Srihari programme held in London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X