వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత ఊరికి ఎన్నారై ఎంతో కొంత: ఈ విధంగా...

By Pratap
|
Google Oneindia TeluguNews

యాదాద్రి: ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లినా.. మాతృభూమి రుణం తీర్చుకుంటున్నాడో ఎన్నారై. ఐర్లాండ్‌లో స్థిరపడిన ఎన్నారై మేకల ప్రభోద్ రెడ్డి.. తన స్వగ్రామం అయిన యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం గ్రామ ప్రజలకు నాలుగేళ్లుగా ఉచిత కార్పోరేట్ వైద్యం అందిస్తున్నారు.

హైదరాబాద్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్ మరియు పీసర్ల రామకృష్ణ రెడ్డిల సహాయంతో గ్రామ ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు తగిన ఆర్థిక సాయం అందిస్తున్నాడు. ఈ సంవత్సరం శివారెడ్డిగూడెం తో పాటుగా ఇరుగు , పొరుగు గ్రామాలైన ఇంద్రియాల , నర్సమ్మకుంట మరియు రెడ్డినగర్ గ్రామ ప్రజలకి కూడా ఉచిత వైద్యం అందించేందుకు కావలసిన ఏర్పాట్లు చేసారు.

NRI extends free health fecility in Sivareddy Gudem

సంక్రాంతి సమయంలో నాట్లు వేసిన రైతులు కీళ్ల నొప్పులతో ,చలి జ్యరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతారు. మొండి ధైర్యంతో కొందరు , ఆర్ధిక స్థోమత లేక మరికొందరు తమ ఆరోగ్యాన్ని నిర్లక్యం చేస్తారు

NRI extends free health fecility in Sivareddy Gudem

ఈ సమస్యకు ఒక పరిస్కారం చూపాలని మా గ్రామానికి ఏదైనా మంచి పని చేయాలనే తపనతో మా గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఐర్లాండ్లో నివాసం ఉంటున్న ప్రభోద్ రెడ్డిని సంప్రదించినప్పుడు, మాకు సహాయం చేస్తానని ముందుకు వచ్చి, ప్రతి సంవత్సరం మా గ్రామానికి ఉచిత వైద్య సేవకు కావలసిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నాడు.

English summary
NRI Mekala Prabhod Reddy is extending free health fcility in his village Sivareddy Gudem in Yadadri district of Telanagana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X