వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇఫ్తార్ విందు: దోహాలో తెలంగాణ ఎన్నారై ఫోరం

By Pratap
|
Google Oneindia TeluguNews

దోహా: దోహ పట్టణంలో తెలంగాణ ఎన్నారై ఫోరం నిర్వాహకుడు (టిఇఎన్ఎఫ్) అబ్బాగొని శ్రీదర్ ఆధ్వర్యంలో ఎన్నారై ఫోరం గల్ఫ్ శాఖ ప్రారంభమైంది. గల్ఫ్ దేశాల నుండి సుమారు 15 మంది తెలంగాణ ఎన్నారై ప్రతినిధులు ఈ ఎన్నారై ఫోరం శాఖను ఏర్పాటు చేసుకున్నారు.

ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు . ముఖ్య అతిథిగా తెలంగాణా పారిశ్రామిక వేత్త, టిపిఎస్ అధ్యక్షుడు పోలీస్ రమేష్ గారు విచ్చేసి ప్రసంగించారు . ఉద్యమ
ఘట్టాలను గుర్తు చేసుకొని, బావిష్యత్తు తెలంగాణా నిర్మాణానికి ప్రవాస తెలంగాణ ప్రజలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపు ఇచ్చారు.

NRI forum wing launched in Doha

అనంతరం తెలంగాణా ప్రాంత ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. రవి కుమార్, ధర్మరాజు ఆట, పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నడిచాయి. తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపకులు గంప వేణు, కుర్మాచలం అనిల్, సిక్క చందు వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలు వచ్చినవారి కష్టాల్లో తోడునీడగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అల్లే శ్రీనివాస్, మొహమ్మద్ సాజిద్, పాషా, అబ్దుల్లా బిన్ అమర్. అనుమల్ల సత్య, పడాల బూపేష్, మురళి, ఆంజనేయులు అన్వేష, సంతోష్ కుమార్, సందీప్ బొడ్ల , వేణుగోపాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Telangana NRIs in Gulf countries have launched Doha wing of Telangana NRI furum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X