కేటీఆర్ స్విస్ వ్యాఖ్యలపై ఎన్నారై టిపిసిసి సెల్ భగ్గు

హైదరాబాద్: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీ రామరావు విదేశీ గడ్డపై అధికార పర్యటన చేస్తూ రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెసు కో ఆర్డినేటర్, టిపిసిసి ఎన్నారై సెల్ కార్యదర్శి గంపా వేణుగోపాల్ ఖండించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు కు ప్రజల పన్నుల సొమ్ము తో అధికార పర్యటన కు వచ్చి తెరాస పార్టీ శాఖలు అంటూ పార్టీ కార్యక్రమాలు ఆవిష్కరణ చేయడం ,రాజకీయాలు మాట్లాడటం కేటీర్ అపరిపక్వతను తెలియచేస్తుందని ఓ ప్రకటలో అన్నారు.

విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని సమయసందర్భాలు లేకుండా మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధం కాగా చర్చకు రాకుండా పారిపోయింది తెరాస పార్టీే కదా అని ఆయన అన్నారు.

NRI TPCC cell condemns KTR Swiss statement

కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలంలో దీర్ఘ కాళిక ప్రయోజనాలతో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ల వల్లే నేడు విద్యుదుత్పత్తి ఈ స్థాయిలో జరుగుతోందని, మూడేళ్ల పసిగుడ్డు ప్రభుత్వమని చెప్పుకునే తెరాస విద్యుత్తు సాధించిందంటే ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి జిల్లాలోని ఆకనూర్‌ ఉప ఎన్నికలో ఎంపీటీసీని గెలిపించుకోలేక పోయిన తెరాస కాంగ్రెస్ విజయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన అన్నారు. నాలుగేళ్లు కావస్తున్నా ఎన్నారై పాలసీ ఏర్పాటు కాలేదని అంటూ రాజకీయాలు పక్కన పెట్టి ముందు పాలసీ ప్రకటించాలని రంగుల సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు

NRI TPCC cell condemns KTR Swiss statement

ప్రభుత్వ అధికారిక కార్య క్రమాలకు ప్రజల సొమ్ము తో స్విట్జర్లాండ్ వచ్చిన కేటీఆర్ ప్రభుత్వ అధికారి అయిన ఐటి సెక్రెటరీ జేయేష్ రంజన్ సమక్షంలో తెరాస పార్టీ సభలో మాట్లాడినట్లు మాట్లాడటం అవివేకమవుతుందని టీపీసీసీ ఎన్నారై సెల్ సంయుక్తం గా విడుదల చేసిన పత్రికా ప్రకటన లో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+