యువకుడికి ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సహాయం

Subscribe to Oneindia Telugu

బహ్రెయిన్: ఉపాధి కోసం వచ్చి ఆస్పత్రిపాలైన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన భైరగోని సంజీవ్ గౌడ్(24)కు ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ సహాయం అందించింది. ఉపాధి కోసం రెండున్నర సంవత్సరాల క్రితం బహ్రెయిన్‌కు వచ్చాడు సంజీవ్ గౌడ్..

ఒక ప్రైవేట్ కంపెనీ లేబర్‌గా పనిచేస్తున్న ఈ యువకుడు ఆరోగ్యం బాగులేక ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే కడుపులో కంతి ( ఫెరలల్ లాప్స్ ) పెరగ డం వల్ల కంపెనీ బాధ్యత తీసుకోలేదు.

మరి కొన్ని కారణాల వల్ల ఇంటికి వెళ్ళడానికి టికెట్ ఇవ్వకపోవడంతో రెండున్నర సంవత్సరాలైనా సెలవు, గత రెండునెలల జీతం ఇవ్వలేదు అతడు పని చేసే సంస్థ. సొంతూరు వెళ్ళడానికి చిల్లి గవ్వలేక, కంపెనీ పట్టించుకోని పరిస్థితిలో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ కమిటీని ఆశ్రయించి తన గోడు విన్నవించుకున్నాడు సంజీవ్.

nri trs cell bahrain helps a youth

కమిటీ సభ్యులు ముందుకు వచ్చి తమ వ్యక్తిగతంగా అందరూ కలిసి ప్రయాణ టికెట్ ను కొనిచ్చి మంగళవారం(జులై 19న) సాయంత్రం హైద్రాబాద్‌కు పంపడం జరిగింది. ఈ విధంగా ఆపదలో ఉన్న వారికి ముఖ్యంగా తెలంగాణ కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు .

ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ నాయకులు గల్ఫ్ కో-ఆర్డినేటర్ సతీష్ కుమార్ రాధారపు, ఇంఛార్జ్ వెంకటేష్ బొలిశెట్టి, నాయకులు డా. రవి, చైతన్య, ప్రశాంత్, సదానంద్, గంగన్న, గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NRI TRS Cell Bahrain helped a youth to reach his hometown.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి