NRI: విదేశాల్లో ఉండే భారతీయులు ఓటు వేయవచ్చా..!

విదేశాల్లో ఉండే భారతీయులు ఎక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటు వేయడం సాధ్యమేనా.

మన దేశం నుంచి చాలా మంది విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తుంటారు. అక్కడ సంవత్సరాల తరబడి ఉంటారు. ఈ క్రమంలో వారు మన దేశంలో జరిగే చాలా ఎన్నికలకు దూరమవుతుంటారు. అయితే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ అశంపై తాజాగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజీజు స్పందించారు.

విదేశాల్లో ఉండే భారతీయులు ఓటు వేసే ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ETBPS)ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సమాధానం ఇచ్చారు. జనవరి 1, 2023 నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20A ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 1,15,696 మంది భారతీయ పౌరులు భారతీయ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

Overseas Indians can vote using electronic transmitted postal ballot system, is it possible

ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961ను సవరించే ప్రతిపాదనను ఎన్నికల సంఘం పరిశీలిస్తందని పేర్కొన్నారు. లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఈ విషయం చర్చిస్తున్నట్లు తెలిపారు.

విదేశాల్లో ఉన్న భారతీయులు ఓటు వేయడానికి ప్రజాప్రాతినిధ్య బిల్లు 2018 ఆగస్ట్ 9న లోక్ సభలో ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. 16వ లోక్ సభ రద్దు అవడం వల్ల ఈ బిల్లు ఆమోదం పొందలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+