సాగర్ ప్రజలు టీఆర్ఎస్ వైపే: ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయం అంటోంది ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్. తాము ఇక్కడ రెండు వారాలకు పైగా వివిధ మండలాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించామని అధ్యక్షుడు అనిల్ కూర్మాచల అన్నారు. నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గడప గడపకు తెలిసేలా విస్తృత ప్రచారం చేశామని అనిల్ కూర్మాచలం తెలిపారు. ఇవాళ హాలియాలో ఎన్నారై తెరాస మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి , కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కల మరియు సీనియర్ నాయకులు రాజ్ కుమార్ శానబోయిన , మల్లేష్ పప్పుల , శ్రీనివాస్ వల్లాల పాల్గొన్నారు.

దేశానికే ఆదర్శంగా..
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా ఉందని అనిల్ అన్నారు. సంక్షేమం అభివృద్దే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని టీఎస్- ఐ పాస్ లాంటి పాలసీలు ప్రవేశపెట్టారని చెప్పారు. విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడానికి మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచాలనే స్పూర్తితో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

అభివృద్ధి పథం
ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. సాగర్ లో భగత్ గెలుపుతో నియోజకవర్గం రెట్టింపు అభివృద్ధితో ముందుకు వెళ్తుందని. నోముల నర్సింహయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మీ ముందుకు వచ్చాడని.. ఆశీర్వదించి అసెంబ్లీ కి పంపితే మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాడని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు గల్లీలో లేదని వారికి పొరపాటున ఒక్క ఓటు వేసినా అది వృధా అవుతుందన్నారు.

టీఆర్ఎస్ వైపే జనం
పది సంవత్సరాల నుంచి సాధారణ ఎన్నికల నుండి ఉపఎన్నికల వరకు మున్సిపాలిటీ నుండి పార్లమెంట్ వరకు ప్రతీ ఎన్నికల్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నామని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. సాగర్ నియోజికవర్గ పరిధిలో గల వివిధ మండలాల్లో విసృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించామని ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications