సతీష్ వేమనకే తానా అధ్యక్ష పీఠం
హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం( తానా) అధ్యక్షుడిగా సతీష్ వేమన గెలుపొందారు. మొదటి నుంచి సతీష్ వేమన విజయం ఖాయమనే మాటే వినిపిస్తోంది. అంచనా వేసినట్లే ఆయన విజయం సాధించారు. సతీష్‌కు 8257 ఓట్లు రాగా ఆయనపై పోటీ చేసిన రామ్‌కు 3137 ఓట్లు వచ్చాయి. సతీష్ వేమన 5120 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
కార్యదర్శిగా ఖమ్మం జిల్లాకు చెందిన తాతా మధు, సహాయక కార్యదర్శిగా పొట్లూరి రవి, కోశాధికారిగా తెనాలికి చెందిన వెన్నం మురళీ గెలుపొందారు. కాలిఫోర్నియా ప్రాంతీయ ఉపాధ్యక్షుడిగా వేమూరి సతీష్ న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధిగా దేవినేని లక్ష్మి, మిషిగన్ ప్రాంతీయ ప్రతినిధిగా యార్లగడ్డ శివరామ్ గెలుపొందారు.

కృష్ణాజిల్లాకు చెందిన లావు అంజయ్యచౌదరి(అట్లాంట) సామాజిక సేవల సమన్వయ కర్తగా ఎన్నికయ్యారు. సతీష్ వేమన 2017-19 సంవత్సరానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తారు.
సతీష్ వేమన స్వస్థలం కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం బొమ్మవరం కమ్మపల్లె. రాయలసీమ నుంచి తానా అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా సతీష్. 2011-13 వరకూ తానా కోశాధికారిగా, ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications