Firing: అమెరికాలో కాల్పులు.. ఆంధ్రప్రదేశ్ వాసి మృతి..
అమెరికాలో కాల్పులు(Firing) సర్వసాధారణమయ్యాయి. నిత్యం ఏదో చోట కాల్పులు జరిగి ప్రజలు మణికిపోతున్నారు. తాజాగా ఆమెరికాలోని ఒహాయోలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏపీ చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన వీరా సాయేశ్ కాల్పుల్లో మరణించాడు. ఎంఎస్ చేయడానికి వెళ్లిన సాయేశ్ గ్యాస్ స్టేషన్లో పార్ట్‌టైం ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 20న ఓ దొంగల ముఠా వచ్చి విధుల్లో ఉన్న అతణ్ని తుపాకీతో కాల్చి హత్య చేశాడు. సాయేశ్ 2021 నవంబరులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. అతని తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోయాడు. నాలుగు రోజుల క్రితం కూడా అమెరికాలో కాల్పులు జరిగాయి.
మైనేలోని ఒక ఇంటిలో మంగళవారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆ తర్వాత హైవేపై వెళ్తున్న వాహనాలపై కూడా కాల్పులు జరిగాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు అంతర్రాష్ట్ర రహదారిలో కొంత భాగాన్ని మూసివేశారు. సాధారణ పౌరులు ఎవరు బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత నిషేదాజ్ఞలు ఎత్తేశారు. దాదాపు 90 నిమిషాలు పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆదీనంలోకి తీసుకున్నారు.

మైనేలో బోడోయిన్‌కు చెందిన జోసెఫ్ ఈటన్ 34 కాల్పులకు తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ కాల్పులకు కారణాలు తెలియరాలేదు. మరో వైపు యర్‌మౌత్‌లోని ఇంటర్‌స్టేట్ 295లో దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో కాల్పులతో జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కొందరు పొడవాటి రైఫిళ్లను తీసుకుని హైవే పైకి వచ్చి కాల్పులు జరిపారని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఆఫ్-ర్యాంప్ వద్ద భారీగా సాయుధ అధికారులు విండ్‌షీల్డ్‌లో స్పష్టంగా బుల్లెట్ రంధ్రాలు ఉన్న కారు గుర్తించారు.

కొద్ది రోజుల క్రితం అమెరికాలో బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. US మీడియా ప్రకారం, టెలివిజన్ స్టేషన్ WRBL ఆదివారం తెల్లవారుజామున అలబామాలోని డాడెవిల్లేలో కాల్పులు జరిగాయి. గాయపడిన వారిలో ఎక్కువగ యువత ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు కాల్పులు జరిగాయి. ఒక యువకుడి పుట్టినరోజు వేడుకలో కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నాష్‌విల్లేలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఓ మహిళా దుండగురాలు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 6 మంది మరణించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆమె మరణించారు. ఈ ఘటన జరిగిన పాఠశాల ప్రీ స్కూల్. అందులో చదువుతున్న పిల్లలంతా 12 ఏళ్లలోపు వారే ఉన్నారు.
-
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications