పిన్నిరూప రాక్షసి, పసిమొగ్గను చిదిమేసింది, అమెరికాలో దారుణం: నిందితురాలికి 25 ఏళ్ల జైలు
న్యూయార్క్ : తల్లి స్థానంలో వచ్చిన ఆమె ప్రవర్తన మాత్రం మారరలేదు. స్నానం చేయిస్తానని చెప్పి .. బాత్ రూంలోకి తీసుకెళ్లి చేయిచేసుకుంది. తర్వాత గొంతునులమి చంపి ... సవతి తల్లి అనే పదానికి ఉదహరణగా నిలిచింది. ఈ ఘటన అమెరికా న్యూయార్క్‌లోని క్వీన్స్ లో జరిగింది. నిందితురాలుకు కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది.

దారుణం ..
అమెరికాలోని క్వీన్స్‌లో షామ్ దాయి అర్జున్ (55) ఉంటోంది. రెస్టారెంట్‌లో పనిచేసే ఒకతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఆయనకు అప్పటికే తొమ్మిదేళ్ల కూతురు ఉంది. కూతురును బాగానే చూసుకుంటానని హామీనిచ్చి ... బుట్టదాఖలు చేసింది. భర్త వెళ్లగానే చిన్నారిపై దాడి చేయడం, మాటలతో హింసించి పైశాచిక ఆనందం పొందింది. చివరకు మట్టుబెట్టి తనకు అడ్డులేకుండా చూసుకుందామనుకొని .. కటకటలపాలై ఊచలు లెక్కబెడుతుంది.

అక్కసుతో దాడి ...
సవిత కూతురుపై అర్జున్ అక్కసు పెంచుకుంది. అడ్డుతొలగించుకోవాలని ప్రణాళిక రచించింది. ఎప్పుడూ భర్త రెస్టారెంట్ కు వెళ్లగానే వేధించడం మొదలెట్టేది. సూటి పొటి మాటలతో హింసించేది. ఇక చేయి చేసుకుని పసిమనసు గాయపరిచేది. ఈ క్రమంలో తనను శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని భావించి .. స్నానం చేయిస్తానని చెప్పింది. అయితే ఆమె ప్రేమ వెనుక దాగి ఉన్న కుట్రను గమనించిన చిన్నారి సరేనంది. బాత్ రూం వెళ్లింది లేదో చేయిచేసుకుంది. బాత్ టాబ్ లో పెట్టి ఊపిరిరాడకుండా చేసి చిన్నారిని చిదిమిసేంది. ఆ రాక్షస తల్లి చేతిలో పసిపాన తుదిశ్వాస విడిచింది.

నిజం వెలుగుచూసిందిలా ..?
క్వీన్స్ లో ఉంటున్న ఓ మహిళ తన పాత అపార్ట్ మెంట్ కు వెళితే జరిగిన ఘోర వెలుగులోకి వచ్చింది. అర్జున్ ఇంటికెళ్లి .. అక్కడే చాలాసేపు ఉంది. కూతురి గురించి అడగగా ఆమె తడబడింది. చివరకు బాత్ రూంలో స్నానం చేస్తుందదని చెప్పింది. గంటలు గడుస్తోన్న చిన్నారి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె .. బాలిక తండ్రిని పిలిపించింది. పిన్ని ఏం చేసిందోనని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో బాత్ రూం తలుపులు పగులగొట్టగా టాబ్ లో చిన్నారి విగతజీవిగా కనిపించింది. దీంతో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పిన్ని అర్జును తనదైనశైలిలో విచారిస్తే నిజానిజాలు వెలుగుచూశాయి.

25 ఏళ్ల శిక్ష ?
పోలీసుల సమర్పించిన సాక్షాలు, కేసు విచారణలో వాదోపవాదనల తర్వాత పిన్ని అర్జున్ కు కోర్టు 25 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. అయితే తుదితీర్పును మళ్లీ జూన్ 3న ప్రకటిస్తామని స్థానిక కోర్టు తెలిపింది. అంతేకాదు ఎన్నోసార్లు చిన్నారిని చంపుతానని బెదిరించినట్టు బాధితురాలు బంధువులు వెల్లడించినట్టు జడ్జి తెలిపారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications