అమెరికా, కెనడాల్లో విస్తరించనున్న టీమ్ స్క్వేర్

బోస్టన్ : గత ఎనిమిదేళ్లుగా నార్త్ అమెరికాలో కష్టాల్లో ఉన్న తెలుగువారికి చేయూతనిస్తూ వస్తోన్న టీమ్ స్వ్కేర్ (తానా) అత్యవసర సహాయక బృందం ఇప్పుడు మరో కొత్త పంథాలో సేవలు అందించడానికి సిద్దమవుతోంది. 2008లో తానా మాజీ అధ్యక్షుడు నన్నపనేని మోహన్ సంస్థను స్థాపించిన నాటి నుంచి నేటి వరకు విజయవంతంగా నడుస్తోన్న టీమ్ స్క్వేర్ ఇకనుంచి అమెరికా, కెనడా దేశాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో బృందాలుగా విస్తరించనుంది.

ఇప్పటికే నాలుగు వందలకు పైగా స్వచ్చంద సేవకులతో ఎదిగి, సుమారు ఆరువందలకు పైగా జరిగిన ప్రమాదాల్లో, సంఘటనల్లో వందలలాది మంది తెలుగు మరియు ఇతర భారతీయులకు ఆపన్న హస్తాన్ని అందించిన టీమ్ స్క్వేర్ రెట్టించిన ఉత్తేజంతో తన కార్యక్రమాలను విస్తృత పరచే దిశలో సాగుతోంది.

Team Square begins services in Boston

అక్టోబర్ 9న, బోస్టన్ లో నన్నపనేని మోహన అధ్యక్షతన టీవి అధినేత శ్రీ రవి ప్రకాష్, హీరో శివాజీ ముఖ్య అతిథులుగా, సుమారు యాభై మంది నిబద్దులైన వాలంటీర్స్ తో సమావేశం అయిన టీమ్ స్క్వేర్ బోస్టన్ పరిసర ప్రాంతాల చాప్టర్ ను ఆవిష్కరించింది. ఈ సందర్బంగా నన్నపనేని మోహన్ మాట్లాడుతూ.. ఇకముందు బోస్టన్ పరిసర ప్రాంతాల్లో ఏ ప్రవాస భారతీయులకైనా, ముఖ్యంగా ఏ తెలుగువారికైనా ఆపదలు ఎదురైతే బోస్టన్ టీమ్ స్క్వేర్ లోని ప్రతి ఒక్క కార్యకర్త ఒక సొంత కుటుంబ సభ్యుడిలా ఆ ఆపదపాలయిన కుటుంబానికి ఆసరాగా వెంటనే స్పందించి ఆసరా అందించేలా ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు.

కష్ట సమయంలో అందించే సేవకు ఎటువంటి ప్రచారం, పొగడ్త లభించకపోయినా ఆ సహాయాన్ని అందుకున్న వారి హృదయాల్లో వెలకట్టలేని కృతజ్ఞత భావం మనకెంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. టీమ్ స్క్వేర్ మొదలైనప్పటి నుంచపి ఈరోజు వరకు ఒక్క సంఘటనలో కూడా ఓటమి, నిరాశ లేకపోవడానికి కారణం నిబద్దత కలిగిన వందలాది మంది కార్యకర్తల కృషే మూలమని ప్రతీ ఒక్క వాలంటీర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Team Square begins services in Boston

టీవీ9 అధినేత రవిప్రకాష్ గారు బోస్టన్ లోకల్ చాప్టర్ ను ఆవిష్కరించి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, కష్ట సమయంలో సాటివారిని ఆడుకొని అందులో సంత్రుప్తి చెందటం చాలా గొప్ప విషయమన్నారు. మనమేం సంపాదించిన మనతో పాటు తీసుకెళ్లలేం గానీ మనం సంపాదించిన మంచితనం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మిమిక్రీ రమేష్ తన వినూత్నమయిన ప్రదర్శనతో నవ్వులు పూయించారు.

ప్రముఖ సినీ హీరో శివాజీ మాట్లాడుతూ సమాజంలో మానవత మరుగవుతున్న ఈరోజుల్లో సాటి వారి కష్టాల్లో చేయూత అందించే ఒకమంచి పనిని ఎంచుకున్నందుకు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. టీమ్ స్క్వేర్ బోస్టన్ చాప్టర్ స్థాపించిన సందర్బంగా దాని కార్యక్రమాలకు స్పందించిన శ్రీనివాస్ బోళ్ల.. వెయ్యి డాలర్ల విరాళాన్ని రవిప్రకాశ్ గారి చేతుల మీదుగా టీమ్ స్క్వేర్ కు అందించారు.

Team Square begins services in Boston

తెలుగు అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ముద్దను హరిబాబు, ప్రెసిడెంట్ చంద్ర తాళ్లూరి, శశికాంత్ వల్లేపల్లి, ప్రకాష్ రెడ్డి, శంకర్ మగపు, బాబురావు పోలవరపు, శ్రీనివాస్ కాకి, కోటేష్ కందుకూరి, శ్రీనివాస్ బచ్చు, మణిమాల, అమర్ జయం, సురేంద్ర, విజయ్ బెజవాడ, మల్లరెడ్డి, శివదోగిపర్తి, పద్మా అంజలి, మాధవి, మాధురి తదితరులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు బోస్టన్ చాప్టర్ కు కార్యకర్తలుగా చేరారు.

నన్నపనేని మోహన్ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ త్వరలోనే టీమ్ స్క్వేర్ లోకల్ చాప్టర్స్ మరో నలభై పట్టణాల్లో మొదలు కాబోతున్నట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+