బహారెన్, మస్కట్ లో వైభవంగా తెలంగాణ వేడుకలు..

బహరేన్ : రాష్ట్ర అవతరణ ధినోత్సవం సందర్భంగా.. బహరేన్ లో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా, తొలుత తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.

అనంతరం మనామా సెంట్రల్ బస్టాండ్ లో ప్రయాణికులకు పండ్లు మరియు వాటర్ బాటిళ్ళు పంపిణీ చేశారు. ఆ తర్వాత వాటర్ గార్డెన్ లో కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల నడుమ వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా.. ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ గల్ఫ్ కో-ఆర్డినేటర్ రాధారపు సతీష్ కుమార్, ఇంచార్జ్ బోలిశెట్టి
వెంకటేష్ లు మాట్లాడుతూ రెండోవ సారి బహరేన్ లో తెలంగాణా రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

telagana formation day celebrations in bahrain and muscat

తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు కూడా కీలకమైన పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కెసిఆర్ గారి సారథ్యంలో సంక్షేమ ఆభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతుందని కితాబిచ్చారు. ఇందుకు ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగిరథ లాంటి కార్యక్రమాలే ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు.

ఇక తెలంగాణా రాష్ట్రాన్ని ప్రపంచ వేదిక మీద అత్యున్నత స్థానంలో నిలపడానికి తమ వంతు పాత్ర ఎప్పడూ ఉంటుందని, ఇందుకోసం బాధ్యతతో కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారై ల పోషించిన పాత్రకు చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ గల్ఫ్, కో-ఆర్డినేటర్ రాధారపు సతీష్ కుమార్, ఇంచార్జ్ బోలిశెట్టి వెంకటేష్, నాయకులూ ప్రశాంత్,బద్రి,రాజేశ్వర్ గౌడ్,సుమన్,డారవి,గంగన్న,రవి దేశెట్టి,రాజు,గంగాధర్
నర్సయ్య,తిరుపతి,శ్రీనివాస్,ప్రకాష్,శంకర్,రాజేష్,సుధాకర్,వినోద్,సదానంద్,బుచ్చి రెడ్డి,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మస్కట్ : బెహరెన్ తరహాలోనే మస్కట్ లోను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు అక్కడి ఎన్నారైలు. టి.ఆర్.ఎస్.ఎన్నారై ఆధ్వర్యంలోతెలంగాణా రెండవ అవతరణ దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగాకేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అక్కడి ఎన్నారైలు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

telagana formation day celebrations in bahrain and muscat

ఈ సందర్భంగా ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ కో-ఆర్డినేటర్ అడువాల శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాభీష్టం మేరకే పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్తుందన్నారు.

చివరగా.. ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఎన్నారై సెల్ తరుపున కృతజ్ఞతలు తెలిపిన మస్కట్ ఎన్నారై బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మస్కట్ ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ కో-ఆర్డినేటర్ అడువాల శంకర్, ఎన్నారై టి.ఆర్.ఎస్.నాయకులు శ్రీనివాస్,లక్ష్మన్,కబీర్,మహిపాల్,మన్సుర్,తిరుపతి,అల్లమోద్దిన్,సయ్యద్,సత్తయ్య,చంద్రయ్య,రాజయ్య,లు పాల్గొన్నారు.

telagana formation day celebrations in bahrain and muscat

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని బహారెన్ లోని బస్టాప్ ప్రాంతంలో అక్కడి టీఆర్ఎస్ ఎన్నారై సెల్ నేతలు పండ్లు, వాటర్ బాటిళ్లను అక్కడి ప్రయాణికులకు పంపిణీ చేశారు.

రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా.. వాటర్ గార్డెన్ లో సమావేశమైన టీఆర్ఎస్ బహారెన్ ఎన్నారై విభాగం నేతలు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అందులో ఎన్నారైల పాత్ర వంటి విషయాల మీద తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

రాష్ట్ర ఆవిర్భావ ధినోత్సవ వేడుకల్లో భాగంగా.. కేక్ కట్ చేసి సంబరాల జరుపుకుంటున్న బహారెన్ టీఆర్ఎస్ ఎన్నారై సెల్ విభాగం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+