లండన్‌లో ఘనంగా బోనాలు: బోనమెత్తిన నటి పూనం కౌర్..

Subscribe to Oneindia Telugu

లండన్: తెలంగాణ ఎన్నారైఫోరం (TeNF) ఆధ్వర్యంలోలండన్ లో(హెస్టన్ కమ్యూనిటీ స్కూల్లో) బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈసంబరాలకు యూకే నలుమూలల నుండి సుమారు 700లకు పైగాతెలంగాణ కుటుంబ సభ్యులుహాజరైయ్యారు.

స్వదేశంలో జరుపుకున్నట్టుసంప్రదాయ బద్దంగా అమ్మవారి ఆలయంలో పూజలునిర్వహించి, లండన్ వీధుల్లో తోట్టెల ఊరేగింపును జరుపుకున్న తీరు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండాస్తానికులని కూడా మంత్రముగ్దులని చేసింది.

ఈ వేడుకలకు తెలంగాణారాష్ట్రం నుండి రామచంద్రుతేజావత్ (రిటైర్డ్ఐఏఎస్) స్థానిక ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ
మల్హోత్రా, బాలాజీ (Indian High Commission -London ) ముఖ్య అతిధులు హాజరై ప్రసంగించారు. 6వ సంవత్సరం వరుసగా ఎంతో వైభవం గ బోనాల జాతర నిర్వహించారు.

Telangana bonalu festival celebrations in london

అమ్మవారి ఆలయంలో పూజలునిర్వహించి, లండన్ వీధుల్లో తోట్టెల ఊరేగింపును జరుపుకున్న తీరు ప్రవాసతెలంగాణ
బిడ్డలనే కాకుండా స్తానికులని కూడా మంత్ర ముగ్దులని చేసింది. తెలంగాణ ఎన్నారై ఫోరం ఈ సంవత్సరము
ప్రధానంగా చేపట్టిన చేనేతకు చేయూతనిద్దాం.. నేతన్నకుమద్దతునిద్దాం.. చేనేతవస్త్రాలయం ద్వారాప్రవాసులకు స్థానికులకుచేనేత వస్త్రాలను పరిచయంచేసిన విధానం ప్రశంసనీయంఅని ముఖ్య అతిధులుకొనియాడారు.

రామచంద్రుడు తేజావత్ మాట్లాడుతూ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఎన్నారై లు తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ
పెట్టుబడుల్లో బాగస్వామ్యులవ్వాలని పిలుపునిచ్చారు . విదేశాల్లో భారతీయ ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు .తెలుగు సినిమా నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నారై ఫోరం చేపట్టిన ఎన్నారై విత్ వీవెర్స్ , చేనేత చేయూతకు తన సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలిపారు.

తెలంగాణ ఎన్నారై ఫోరమ్ తో చేనేతకు చేయూత కు కలిసి పని చేస్తానని తెలిపారు. తెలంగాణఎన్నారై ఫోరం
మహిళా విభాగంతో కలిసి హ్యాండ్లూమ్ వాక్ లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు బోనాలు
పండుగ వేడుకలలో తాను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని నటి పూనమ్ కౌర్ పేర్కొన్నారు.

తెలంగాణ ఎన్నారై ఫోరంసంస్థ విద్య, సంగీతం, కళలు,సాంస్కృతిక, క్రీడలు,వ్యాపారం, స్వచ్ఛంద మరియు సమాజ సేవ
వంటిపలు రంగాలలో ప్రతిభకనబరచిన విద్యార్థులకు,యువతీ యువకులకు, ఆచార్య శ్రీ జయశంకర్ పురస్కారములు అందచేశారు.అలాగే ఈబోనాలు వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతిఒక్కరిని
జ్ఞాపికలతోప్రశంశించారు.

బోనాల పండుగకు యూకే తెలుగు ,తెలంగాణ సంఘాలు,యుక్త ,తాల్ ,టీడీఫ్ తెలంగాణ జాగృతి ,తమ
సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతంలో పాలు పంచుకున్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరంఐదు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల, అతిథులకు వివరించారు.

ఖండాంతరాలలో ఉంటూ తెలంగాణా పేదబిడ్దలకు, అనాధలకు వికలాంగుల బిడ్డలకు చేస్తున్నఆర్థిక సహాయం
వెలకట్టలేనిదని తెలిపారు. ఆభరణాలు ,ఆధునిక వస్త్ర శ్రేణి మరియు కళలకు సంబంధించిన ప్రదర్శనను మొదటి సారిగా
తెలంగాణఎన్నారై ఫోరం సంస్థనిర్వహించడం ఔత్సాహిక కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది అని ,తమ ప్రతిభను
ప్రదర్శించివ్యాపారభివ్రిద్దికి ఎంతోతోడ్పాటును ఇస్తుందని ప్రదర్శనలో పాల్గొన్నకళాకారులు తమ సంతోషాన్ని వ్యక్తం
చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Bonalu Celebrations grandly celebrated in London organized by Telangana NRI
Please Wait while comments are loading...