• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లండన్‌లో ఘనంగా తెలంగాణ బోనాలు(పిక్చర్స్)

|

లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం(టిఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకె నలుమూలల నుండి సుమారు 700లకు పైగా తెలంగాణ కుటుంబసభ్యులు హాజరైయ్యారు.

ఈ వేడుకలకు తెలంగాణా రాష్ట్రం నుండి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులను కూడా ముగ్ధులని చేసింది.

ఈ సంవత్సరం జరుపుకొనే పండగకు ప్రత్యేకత ఉందని, తెలంగాణ రాష్ట్ర పండగగా కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చాయని తెలంగాణ ప్రవాసులు తెలిపారు. తెలంగాణా మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తమ ఆహ్వానాన్ని మన్నించి లండన్ విచ్చేయడమేగాక, తమ ఆడబిడ్దలతో పాటు బోణం ఎత్తుకోవడం తమకెంతో స్ఫూర్తినిచ్చిందని కమిటీ సబ్యులు, హాజరైన ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలిపారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం మూడు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ఈ సందర్భంగా ప్రదర్శించి, అతిథులకు వివరించారు. ఇది చూసి హాజరైన ప్రతి ఒక్కరు ఉద్వేగానికి లోనయ్యారు.

బోనాల ఊరేగింపు తర్వాత ఏర్పాటు చేసిన వేడుకల సభలో తెలంగాణా మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యమంలో ఎన్నారై ల పాత్ర గొప్పదని తెలిపారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో తెలంగాణా ఎన్నారై ఫోరమ్ లండన్ వీధుల్లో జై తెలంగాణ అంటూ చేసిన పోరాటం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.

ఈ బోనాలు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లుగానే అనిపించిందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరుని

ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు బిజీగా ఉన్నప్పటికీ, బాధ్యత గల

తెలంగాణ బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.

బోనాలు

బోనాలు

తెలంగాణ ఎన్నారై ఫోరం(టిఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకె నలుమూలల నుండి సుమారు 700లకు పైగా తెలంగాణ కుటుంబసభ్యులు హాజరైయ్యారు.

బోనాలు

బోనాలు

ఈ వేడుకలకు తెలంగాణా రాష్ట్రం నుండి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

బోనాలు

బోనాలు

స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులను కూడా ముగ్ధులని చేసింది.

బోనాలు

బోనాలు

ఈ సంవత్సరం జరుపుకొనే పండగకు ప్రత్యేకత ఉందని, తెలంగాణ రాష్ట్ర పండగగా కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చాయని తెలంగాణ ప్రవాసులు తెలిపారు.

బోనాలు

బోనాలు

తెలంగాణా మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తమ ఆహ్వానాన్ని మన్నించి లండన్ విచ్చేయడమేగాక, తమ ఆడబిడ్దలతో పాటు బోణం ఎత్తుకోవడం తమకెంతో స్ఫూర్తినిచ్చిందని కమిటీ సబ్యులు, హాజరైన ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలిపారు.

ఖండాంతరాల్లో ఉంటూ తెలంగాణా పేద బిడ్దలను, అనాధలను, వికలాంగుల బిడ్డలకు చేస్తున్న ఆర్థిక సహాయం వెల కట్టలెనిదని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం- తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ పథకాల గురించి వివరించారు. టిఆర్ఎస్ ప్రబుత్వం, ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతుందని, అందరి సూచనలని తీసుకొని ముందుకు వెతుందని చెప్పారు. కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు లేదా సందేహాలు ఉన్నా వ్యక్తిగతంగా తనను కానీ, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కానీ సంప్రదించవచ్చునని తెలిపారు.

ప్రతి తెలంగాణ బిడ్డ మిషన్ కాకతీయలో బాగాస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో, నేడు పునర్నిర్మాణంలో వారి మాతృ భూమికి చేస్తున్న సేవలకు గాను, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినిధులు స్వామి గౌడ్‌ని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు.

తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు సిక్కా చందు గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో స్వామి గౌడ్ పాత్రను, మలి దశ ఉద్యమంలోనే కాకుండా, 1969లో

నూనూగు మీసాల వయస్సు నుంచి నేడు తెలంగాణా రాష్ట్ర సాధన వరకు చేసిన పోరాటాల గురించి సభకు వివరించారు.

పిలవగానే వచ్చి ఈ బోనాల వేడుకల్లో తమతోపాటు భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణా ఎన్నారై ఫోరమ్ తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరూ ఇందులో బాగస్వాములు కావాలని పిలుపున్నిచ్చారు.

తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం సభ్యులు చేసిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కోసం నిర్వహించిన రాఫెల్‌లో అందరూ పాల్గొని విజేతలు బంగారం బహుమతులు గెల్చుకున్నారు. అలాగే, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ జ్ఞాపికలతో ప్రశంసించారు.

సంప్రదాయ తెలంగాణ వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గంగాసాని, మంద సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు సిక్కా చందు గౌడ్, తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలంతోపాటు ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ ఉదయ నాగరాజు, సంయుక్త కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఈవెంట్స్ ఇంఛార్జ్ నగేష్ రెడ్డి, ఈవెంట్స్ సెక్రటరీ శ్వేతా రెడ్డి, అడ్వైజరి బోర్డు సభ్యులు ప్రమోద్ అంతటి, మహిళా విభాగం సభ్యులు అర్చన జువ్వాడి, మీనాక్షి, సుమ, స్వాతి, వాణి, నిర్మల,శుషుమ్న, దీప్తి ఇతర కమిటీ సభ్యులు శ్రీధర్, రోహిత్ రేపక,అశోక్ గౌడ్, నవీన్ రెడ్డి, రత్నాకర్, హరి గౌడ్ నవపేట్, మల్లా రెడ్డి, విక్రం రెడ్డి, నరేష్, రంగు వెంకట్, శివాజీ షిండే, శ్రీకాంత్ జెల్ల, ఆక్రం, శ్రీనివాస్ రుద్ర చిట్టి వంశీ, సందీప్ గౌడ్, శ్రీధర్ రావు, స్వదేశం నుండి వచ్చిన కరీంనగర్ టిఆర్ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి కాసార్ల, తదితరులు పాల్గొన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Bonalu celebrations held in London, by the TENF.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more