NRI News: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందింది. ఏపీకి చెందిన పరిమళ నాగశ్రీ వందన కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గణేష్, రమాదేవి దంపతుల కూతురు నాగశ్రీ వందన పరిమళ ఉంది. నాగశ్రీ వందన పై చదువుల కోసం 2022లో అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రానికి వెళ్లారు.టెన్నెసీ రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఆమె మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) చదువుతున్నారు.
శుక్రవారం రాత్రి నాగశ్రీవందన తన కారులో ప్రయాణిస్తుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ వందన ఆమె కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగశ్రీ వందనకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నాగశ్రీ వందన చనిపోయిందన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నాగశ్రీ వందన పరిమళ పార్థీవ దేహాన్ని స్వగ్రామం తెనాలికి పంపించేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా తెలుగు విద్యార్థి మృతి చెందాడు. తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌షైర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 ఏళ్ల పంగులూరి చిరంజీవి కన్నుమూశాడు. చిరంజీవి ప్రయాణిస్తున్న కారు కాలువలో పడిపోవడంతో నీటిలో మునిగిపోయాడు. కారులో మహిళాతో సహా ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. చిరంజీవి మాత్రం చనిపోయాడు. వీరంతా ఏపీకి చెందినవారిగా గుర్తించారు.












Click it and Unblock the Notifications