NRI News: జపాన్ లో తెలుగు వారి వన భోజన మహోత్సవం..
భారతీయులు ఎక్కడున్నా.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా తెలుగువారు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా.. తెలుగు పండుగలు జరుపుకుంటున్నారు. తాజాగా జపాన్ తెలుగు సమాఖ్య (JTS) ఆధ్వర్యంలో టోక్యోలోని కొమత్సుగావా పార్క్‌లో తెలుగు ప్రజల వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. మధ్యాహ్నం తెలుగు వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు.
జపాన్‌లోని తెలుగు ప్రజల్లో ఐక్యత ఇలాగే కొనసాగాలని నిర్వాహుకులు కోరుకున్నారు. అటు అమెరికాలోని రోడ్ ఐలాండ్ లో తానా న్యూ ఇంగ్లండ్ విభాగం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఎన్నారైలు ఆనందగా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ కాంతులు, సంగీతం, సంప్రదాయాలతో కూడిన వేడుకల్ భారతీయులు పాల్గొన్నారు. న్యూ ఇంగంల్డ్‌లో నలువైపుల నుంచి వచ్చిన కుటుంబాలతో వేడుకల ప్రాంగణం నిండిపోయింది. ఇటు కువైట్‌లోదక్షిణ భారత రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. ఎంబసీ ఆడిటోరియంలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ కమ్యూనిటీ సంఘాలతో సంయుక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో దక్షిణాది రాష్ట్రాల వావరు పాల్గొన్నారు. అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎంబసీ 12 వాట్సాప్ నంబర్‌లు అందుబాటులో ఉన్నాయని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా చెప్పారు.
ఎంబసీ సిబ్బందిగా నటిస్తూ మోసగాళ్లు సహాయం కోసం డబ్బులు అడుగుతున్నారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్నడ కూట, తుళు కూట, బిల్లవ సంఘం, తెలుగు కళా సమితి, జానపద నృత్య ప్రదర్శనలు చేశారు.












Click it and Unblock the Notifications