లండన్‌లో ‘బతుకమ్మ’: పోస్టర్ ఆవిష్కరించిన కవిత(ఫొటో)
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా లండన్‌లో తెలంగాణా ఎన్నారైఫోరమ్(టిఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘బతుకమ్మ - దసరా సంబరాలు' పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణా భవన్‌లో నిర్వహించారు.
ప్రతి సంవత్సరం బతుకమ్మ-దసరా సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటామని, కానీఈ సంవత్సరం పండగతో పాటు తమ వంతు బాధ్యతగా, తెలంగాణారైతు కుటుంబాలని ఆదుకోవాలన్న ఎంపి కవిత పిలుపు మేరకు ‘ఈచ్ వన్ అడాప్ట వన్'కు మద్దతుగా బతుకమ్మ-దసరా వేడుకల్లో రాఫెల్ ద్వారా సమకూరే మొత్తాన్నిఅందచేయాలని నిర్ణయించుకున్నామని నిర్వాహకులు తెలిపారు.

రైతు కుటుంబాలని ఆదుకోవాలనే సంకల్పంతో ముందుకు వచ్చి మద్దతు తెలిపినందుకు వారిని ఎంపీ కవిత అభినందించారు. సంస్థ నిర్ణయాన్నిఅభినందించి, ప్రోత్సహించి ‘బతుకమ్మ-దసరా' సంబరాలపోస్టర్‌ను ఆవిష్కరించిన కవితకు నిర్వాహకులు కృతజ్ఞతలు
తెలిపారు.
అక్టోబర్ 24న సాయంత్రం 4 గంటల నుండి వెస్ట్ లండన్‌లోని లాంప్టొన్ స్కూల్ ఆడిటోరియమ్, హౌంస్‌లో జరగబోయే వేడుకల్లో పాల్గొని తెలంగాణా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతూ.. అడాప్ట్- ఫార్మర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణా ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాక సభ్యులు గంప వేణుగోపాల్, ఎఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్ శణాబోయన, కో కోర్డిన్‌టోర్లు ప్రవీణ్ కుమార్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications