అమెరికాలో ఆంధ్రా యువకులు అరెస్ట్: అతనితో పార్టీకి సంబంధం లేదన్న వైసీపీ..!
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తుల మరో యువకుడిని ఏడు నెలలుగా బంధించి అతన్ని చిత్ర హింసకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సత్తారు వెంకటేష్ రెడ్డి, నిఖిల్ పెన్మత్స, శ్రావణ్ పెనుమెచ్చలు అనే ఈ ముగ్గురు కలిసి ఓ యువకుడిని బంధించారు. యువకుడు స్టడీ వీసాపై అమెరికాకు వెళ్లాడు.
స్థానిక మీడియా కథనం ప్రకారం బాధితుడు సత్తారు వెంకటేష్‌కు బంధువని తెలుస్తోంది. బాధితుడికి ఓ కాలేజీలో సీటు రావడంతో అతను అమెరికాకు వెళ్లడం జరిగింది. సత్తారు వెంకటేష్ రెడ్డి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అయితే వెంకటేష్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు బాధితుడిని ఒక పనిమనిషిలా వాడుకున్నారు. అతన్ని ఇంటి బేస్‌మెంట్‌లో ఉంచి చిత్ర హింసకు గురిచేశారు. ఆహారం నీళ్లు కూడా ఇవ్వకుండా చితకబాదేవారని సమాచారం.

అయితే నవంబర్ 30వ తేదీన బాధితుడు ఆ చెర నుంచి ఎలాగో అలాగా తప్పించుకుని బయటపడ్డాడు. బాధితుడిని చూసిన మరో పౌరుడు అతన్ని దగ్గరకు తీసుకుని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఫోన్ నెంబర్ తీసుకున్న బాధిత యువకుడు తనను ఏ రకంగా ఈ ముగ్గురు చిత్ర హింసలకు గురిచేశారన్నది ఆ పౌరుడితో వాట్సాప్ ద్వారా పంచుకున్నాడు. దీంతో ఆ స్థానిక పౌరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగు చూసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ముగ్గురు కలిసి తనను మూడు ప్రాంతాలకు తీసుకెళ్లి చితకబాదినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఈ విషయం బయటకు పొక్కడంతో పొలిటికల్ టర్న్ తీసుకుంది. సత్తారు వెంకటేష్ రెడ్డి వైసీపీకి చెందిన కార్యకర్తంటూ తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున్న ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే టీడీపీ చేసిన ఈ ఆరోపణలను వైసీపీ ఖండించింది. అమెరికాలో అరెస్టు అయిన సత్తారు వెంకటేష్ రెడ్డికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ విషయమై క్లారిటీ తీసుకునేందుకు ఓ జాతీయ మీడియా సంస్థ ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని సంప్రదించగా సత్తారు వెంకటేశ్ రెడ్డి వైసీపీలో ఎప్పుడూ లేరని తాను ఉన్నట్లుగా కూడ తనకు గుర్తులేదని అంతకుముందు ఎప్పుడూ వెంకటేష్ పేరు వినలేదని స్పష్టం చేశారు.
అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ఆర్ఐ సత్తారు వెంకటేష్ రెడ్డికి, పార్టీ కి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటనను వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కేసులో ఉన్న సత్తారు వెంకటేష్ రెడ్డి చేసిన నేరం అతని వ్యక్తిగతం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
— YSR Congress Party (@YSRCParty) December 1, 2023
టీడీపీ చేస్తున్న ప్రచారం పై వైసీపీ కౌంటరిచ్చింది. గతంలో మహిళల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నేతలు మోదుగుమూడి కిషన్ చౌదరి, చంద్రకళ పూర్ణిమల గురించి ఇంకా ఎవరూ మర్చిపోలేదని వైసీపీ కౌంటరిచ్చింది.అప్పట్లో వీరిపై ఆరోపణలు వచ్చిన సమయంలో కనీసం టీడీపీ పార్టీ కానీ అందులోని నాయకులు కానీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించింది. కనీసం పార్టీ నుంచి కూడా వారిని సస్పెండ్ చేయలేకపోయిందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications