ఐర్లాండ్‌లో మరో భారతీయుడిపై దాడి.. జాత్యహంకారానికి ఫుల్ స్టాప్ లేదా ?
ఐర్లాండ్‌లో భారతీయులపై దాడులు పెరుగుతున్న ఘటనలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి. రీసెంట్ గానే వాటర్‌ఫోర్డ్ నగరంలోని కిల్‌బర్రీ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి చెందిన 6 ఏళ్ల చిన్నారి నియా నవీన్‌పై తోటి పిల్లలు జాత్యహంకార దాడి చేశారు. బాలిక ప్రైవేట్ భాగాలను గాయపరిచి పరారయ్యారు. ఈ దాడి ఘటనను మరువక ముందే ఇప్పుడు డబ్లిన్‌లోని ఫెయిర్‌వ్యూ పార్క్‌లో మరో భారతీయుడిపై ముగ్గురు టీనేజర్లు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడగా.. ఎనిమిది కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు వెల్లడించారు. తాను పార్క్ నుంచి ఇంటికి నడుస్తుండగా.. ఒక టీనేజర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వచ్చి తన కడుపులో తన్నాడని వాపోయాడు. దాంతో దూరంగా వెళ్లడానికి ప్రయత్నించగా, మరో ఇద్దరు కూడా వచ్చి కొట్టడం ప్రారంభించారని.. నేలపై పడిపోయిన తర్వాత కూడా దాడి కొనసాగించారని కన్నీటి పర్యంతం అయ్యారు. ఒక వ్యక్తి ఏకంగా మెటల్ వాటర్ బాటిల్‌తో కంటి మీద కొట్టాడని తెలిపాడు.

అయితే తనపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న కొంతమంది చూస్తూ ఉన్నారే తప్ప జోక్యం చేసుకోలేదని అన్నారు. అయితే ఇద్దరు టీనేజ్ యువకులు తనకు సహాయం చేసి పోలీసులకు సమాచారం అందించారని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.
మరోవైపు ఈ దాడిని ఐర్లాండ్ దేశాధ్యక్షుడు మైఖేల్ డి. హిగ్గిన్స్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడులలో కొన్ని జాత్యహంకారంతో ముడిపడి ఉన్నాయని పేర్కొంటూ.. సదరు ఘటనను "నీచమైనవి" అని అభివర్ణించారు. భారతీయ సమాజం ఐర్లాండ్‌కు చేసిన సహకారాన్ని కొనియాడారు. ఈ దాడులు ఐరిష్ సమాజంలోని ఆతిథ్యం, స్నేహం ప్రాథమిక లక్షణాలను దెబ్బతీస్తున్నాయని వివరించారు.
అంతకు ముందు..
కిల్‌బర్రీ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి చెందిన 6 ఏళ్ల చిన్నారి నియా నవీన్‌పై తోటి పిల్లలు జాత్యహంకార దాడి చేశారు. నియా తన నివాసం బయట స్నేహితులతో ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారు కొంతమంది అక్కడికి వచ్చారు. అదే సమయంలో నియా తల్లి.. మరో పాపకు చిన్నపిల్లకు పాలిచ్చేందుకు లోపలికి వెళ్లింది. అప్పుడు వారు నియా ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ.. సైకిల్‌తో ఆమె ప్రైవేట్ భాగాలను గాయపరిచారు. అంతే కాకుండా "డర్టీ ఇండియన్", "గో బ్యాక్ టు ఇండియా" అంటూ తీవ్ర జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తున్నారు. బాలిక కేకలు విని పరుగెత్తుకొచ్చిన తల్లి, దాడి చేసిన పిల్లలు అక్కడి నుంచి పారిపోతుండడం గమనించింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications