సియాటెల్‌లో టిఆర్ఎస్ 15వ వార్షికోత్సవ వేడుకలు
న్యూయార్క్: తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నారై విభాగం ఎన్నారై టిఆర్ఎస్- యూఎస్ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. గత సంవత్సరం మిన్నియాపోలిస్ నగరంలో నిజామాబాద్ పార్లమెంటుసభ్యులు కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ప్రారంభించబడింది.
ప్రస్తుతం వాషింగ్టన్ డీ.సీ, చార్లెట్, కొలంబస్, సిన్సినాటి, బోస్టన్, టాంప, లాస్ ఏంజెలెస్, బే ఏరియా, డల్లాస్, డెట్రాయిట్, న్యూజెర్సీ, సియాటిల్, కాన్సాస్ సిటీ, హూస్టన్, అట్లాంటా వంటి నగరాల్లో శాఖలను ఏర్పాటు చేసుకుంది.
గత భుధవారం సియాటిల్ నగరంలో పార్టీ 15వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగ
నిర్వహించారు. ఏప్రిల్ 29న డల్లాస్ నగరంలో, బే ఏరియాలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఏప్రిల్ 30న మిన్నియాపోలిస్, డెట్రాయిట్, న్యూ జెర్సీలో వేడుకలు నిర్వహించనున్నారు.

మే 6న లాస్ఏంజెలెస్, వాషింగ్టన్ డీ.సీలో పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. టిఆర్ఎస్ పార్టీ పట్ల, సీఎం, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నాయకత్వం పట్ల తెలంగాణ ఎన్నారైల్లో అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్నట్లు ఎన్నారై టిఆర్ఎస్ యూఎస్ఏ నాయకులు తన్నీరు మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత సంవత్సర కాలంగా సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణానికి మాతృ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించుటకు ఎన్నారై టిఆర్ఎస్-యూఎస్ఏ కార్యకర్తలు వివిధ కంపెనీల సీఈఓలతో
సమావేశాలను ఏర్పాటు చేశారు.
కెసిఆర్ పాలన, ప్రభుత్వ పని తీరు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తెలంగాణ ఎన్నారైలకు అవగాహనా కలిపిస్తూ విస్తృత స్థాయిలో ప్రచారం కలిపిస్తున్నారు. ఎన్నారై టిఆర్ఎస్-యూఎస్ఏ కార్యక్రమాల పట్ల ఆసక్తిగల ఎన్నారైలు ఈమెయిల్ ద్వారా [email protected]ను సంప్రదించమని కోరారు.
ఎన్నారై టిఆర్ఎస్-యూఎస్ఏ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ఎన్నారైలకు ఒక వారధిగా ఉంటూ అన్ని సంఘాలను ఒకే తాటి పై తెచ్చే విధంగా తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని అని తెలిపారు.












Click it and Unblock the Notifications