వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గం ఇదే

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: టిఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గం అధికారికంగా ప్రకటించారు. భారతదేశంలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆస్ట్రేలియాలోని ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అండగా నిలుచుకుంటూ వస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నప్పటికీ తెలంగాణ అభివృద్ధి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని వారు చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ పేరుతో తాము ఎలాంటి గ్రూప్స్ తయారు చేయడం లేదని తెలిపారు.

జూలై 2014 నుంచి ఎంపీ కవితతో పాటు తెలంగాణ జాగృతి, టిఆర్ఎస్ ఆస్ట్రేలియాతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. ఆస్ట్రేలియాలో జీవిస్తున్న తెలంగాణ ప్రజలు, ఓసీఐఎస్, ఆస్ట్రేలియన్ సిటిజన్స్, ఎన్నారైలు, విద్యార్థులు, లీగల్ వర్క్ పర్మిట్ హోల్డర్లు టిఆర్ఎస్ ఆస్ట్రేలియాలో చేరినట్లు ఇక్కడి పార్టీ నేతలు చెప్పారు.

ఇండియాలోని టిఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని వారు తెలిపారు. ఆత్మ గౌరవం కోసం టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుతోపాటు తెలంగాణ కోసం ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు పోరాటం చేశారని చెప్పారు. అదే ఆత్మ గౌవరంతో ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రవాసులు టిఆర్ఎస్ ఆస్ట్రేలియాను ప్రారంభించినట్లు తెలిపారు.

TRS Australia is now officially launched

టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, కేశవరావు, హరీశ్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, కవిత, తదితర నేతల నాయకత్వంలో పని చేసేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఆస్ట్రేలియా టిఆర్ఎస్ ఎంతో బలంగా ఉందని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధి, టిఆర్ఎస్ పార్టీ కోసం ఇతర దేశాలకు చెందిన టిఆర్ఎస్ విభాగాలతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. నిజామాబాద్ ఎంపీ కవితను కలిసి.. ఆస్ట్రేలియా టిఆర్ఎస్ గురించి వివరించినట్లు వినోద్ ఏలేటి తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలతో మాట్లాడి ఆస్ట్రేలియా టిఆర్ఎస్ పై చర్చించినట్లు తెలిపారు.

టిఆర్ఎస్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా బృందం, టిఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇండియా టీంకు అభినందనలు తెలిపారు. సభ్యుల వివరాలను త్వరలోనే వెల్లడవుతాయని తెలిపారు. టిఆర్ఎస్ మద్దతుదారులందరూ టిఆర్ఎస్ ఆస్ట్రేలియాలో చేరాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

డిపెండెంట్ వీసా ఉన్నవారిని ఎన్‌రోల్ చేయవద్దని తమ లీగల్ అడ్వైజర్స్ సూచించారని, ప్రస్తుతం 457మంది మోసపూరిత వీసాలతో ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. టిఆర్ఎస్ ఆస్ట్రేలియా కార్యకలాపాల కోసం తమ వెబ్ పేజీని గమనిస్తూ ఉండాలని సూచించారు. ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతితో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.

జాతీమ కమిటీ వివరాలు

మెల్బోర్న్:

1. విజయ్ రెడ్డి
2. అనీల్ దీప్ గౌడ్
3. కపిల్ రెడ్డి
4. సురేన్ వంగపల్లి
5. బీరవెల్లి శశిధర్ రెడ్డి
6. నల్లని సతీష్ చౌదరి
7. పెద్ది శ్రీనివాస్
8. సుమన్ పారుపాటి
9. అశోక్ బెల్లాల
10. జయపాల్ వంటేరు
11. రమేష్ తౌటిరెడ్డి
12. శేఖర్ కకునూరు
13. హరిణి పట్లోళ్ల
14. చంద్రశేఖర్ గంగసాని
15. నవీన్ గుడిమెట్ల
16. మమత పట్లోళ్ల
17. కవిత పుచ్ఛకాయల
18. రాజసింహారెడ్డి గంగసాని
19. మమత కకునూరు
20. శ్రావణి దేవిరెడ్డి
21. సాయిచరణ్ పన్నాల
22. ఆనందర్ చుక్క
23. ప్రవీణ్ నల్ల
24. శ్రీధర్ పాటిల్
25. సుదీప్ ఆలేటి
26. ప్రీతమ్ ఏలేటి
27. వియాక్ కోలేపి
28. భరత్ గడ్డం
29. అభిజిత్ మామిడి
30. శ్రీపాల్ బొక్కా
31. సంజయ్ సేథీ
32. మహేందర్ గుర్రాల
33. చంద్రశేఖర్ దాసరి
34. అరుణ్ గుడుకుంట్ల
35. రాజేష్ గుట్ట

బ్రిస్బేన్:

1. రణధీర్ అరుట్ల
2. భరత్ కసిరెడ్డి
3. సందీప్ రెడ్డి
4. అంజూ రావు
5. వెంకట్ రిక్కల
6. వంశీ కృష్ణ
7. గణేష్
8. జోసుష్
9. శరత్ కొర్పోలు
10. అవినాశ్ పన్నాల
11. నిఖిల్ వెలుముల
12. రాజశేఖర్ బద్దం
13. రంజన్ కుమార
14. ప్రతాప్ కుమార్
15. ఆనంద్ రెడ్డి

కాన్‌బెర్రా:

1. వెంకట గన్రెడ్డి
2. రాజవర్ధన్ కోఠి
3. రవి సాయుల

సిడ్నీ:

1. ప్రవీణ్ పిన్నమ
2. సుమేష్ రెడ్డి
3. పవన్ రెడ్డి
4. కుమార్ గుప్తా
5. రాజేష్ అర్షనపల్లి
6. నరేష్ రెడ్డి భీంరెడ్డి
7. రఘు రెడ్డి బీరం
8. రాజశేఖర్ అనంతోజు
9. వేణు ముద్దసాని
10. రాంరెడ్డి
11. కిరణ్ అల్లూరి
12. రూపా సూరం
13. విష్ణఉ చిట్యాల
14. రవి అనంతుల
15. ఓబుల్ రెడ్డి
16. సంగీత కోట్ల
17. పద్మిని చాడ
18. ప్రశాంత్
19. రమణ ఆవుల
20. రఘు రెడ్డి
21. సందీప్ మదాడి

జాతీయ కోర్ కమిటీ అధ్యక్షుడు రాజేష్ గంగసాని, ఉపాధ్యక్షులు సందీప్ మునుగాల, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ పిన్నామ, సెక్రటరీ అనిదీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సుమన్ పారుపటి, ఎన్ఎస్‌డబ్ల్యూ స్టేట్ అధ్యక్షుడు సుమేష్ రెడ్డి, సెక్రటరీ పవన్ పాపయ్యగారి, విఐసి స్టేట్ అధ్యక్షుడు కపిల్ కట్పల్లి, సెక్రటరీ సురేన్ వంగపల్లి, ఏసిటి స్టేట్ అధ్యక్షుడు రాజవర్ధన్ కోఠి, సెక్రటరీ రవి సాయుల, క్యూ ఎల్డీ స్టేట్ అధ్యక్షుడు రణధీర్ ఆరుట్ల, సెక్రటరీగా భరత్ కసిరెడ్డిలు నియమితులయ్యారు. సుమారు 700మందికి పైగా టిఆర్ఎస్ జాతీయ విభాగంలో చేరినట్లు తెలిపారు.

English summary
TRS Australia is now officially launched. TRS activists and TRS supporters in Australia are working hardly since TRS Party formation in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X