బీజేపీ వచ్చాక రోజుకు 10 కి.మీ, కాంగ్రెస్ ఉన్నప్పుడు? : నితిన్ గడ్కరీ
న్యూజెర్సీ : అభివృద్దిని కాక్షించే ఏ దేశానికైనా సరే మెరుగైన రవాణా వ్యవస్థ ఉండడం అత్యంత ఆవశ్యకం. వేగవంతమైన కనెక్టివిటీ ఉన్నప్పుడే రాష్ట్రాలతో అనుసంధానమైనా..! ప్రపంచ దేశాలతో సంబంధాలైనా..! త్వరగా మెరుగుపడుతాయి. సరిగ్గా ఇవే అంశాలను ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ పాలనలో దేశ రవాణ వ్యవస్థ మరింత మెరుగుపడే దిశగా పయనిస్తోందన్నారు కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.
ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజెపి మిత్రులు అమెరికాలోని న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి బీజేపీ ఎన్నారై ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన ఆయన ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజెపి జాతీయ ప్రెసిడెంట్ గా కొత్తగా ఎన్నికయినా ఏనుగు కృష్ణ రెడ్డి ని సత్కరించారు.
దాదాపు 450 మంది హాజరైన ఈ సమావేశానికి ప్రవాస భారతీయ జనతా పార్టీ మిత్ర బృందం, న్యూ జెర్సీతెలుగువారు, ఉత్తర , దక్షిణ రాష్ట్రాల వారు సభికులందరికీ స్వాగతం తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంబించారు.

ఈ సందర్బంగా మాట్లాడిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ..అమెరికా లాంటి దేశం ఈరోజున అగ్ర రాజ్యంగా ఉందంటే, దానికి ప్రధాన కారణం అమెరికా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండడమే అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలోను భారత దేశం లో కూడా మంచి రవాణా వ్యవస్థ రూపుదిద్దుకోబోతుందన్నారు. రవాణ వ్యవస్థ అభివ్రుద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా చెప్పిన ఆయన ప్రస్తుతం దేశంలో రోజుకి ఇరవై కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరిస్తున్నామన్నారు. గత కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ.. కాంగ్రెస్ హయాంలో కేవలం రోజుకు రెండు కిలోమీటర్ జాతీయ
రహదారి వేసేవారని అన్నారు.
కాగా ఇప్పటిదాకా రవాణా వ్యవస్థ అభివ్రుద్ది కోసం మూడు లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులపై సంతకాలు చేసినట్టుగా అని తెలిపారు
అలాగే దేశ తీర ప్రాంతం ,సరిహద్దులు భద్రత చేసుకోవడం మరియ పొరుగు దేశాల అవసరాలు మేరకు పరస్పర సహకారం వల్ల భారత దేశం అంతర్గతంగాఅభివృద్ధి చెందుతుందని అన్నారు నితిన్ గడ్కరీ. మోడీ పాలనలో చాలా దేశాలతో భారత్ కు స్నేహ సంబంధాలు బలపడుతాయన్నారు.

ఈ కార్యక్రమం లో కృష్ణ రెడ్డి అనుగుల (ప్రెసిడెంట్ -ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజెపి ), జయేష్ పటేల్ , రఘు రెడ్డి , అరవింద్ మొదిని, విలాస్ రెడ్డి జంబుల (యూత్ కో -కన్వెనోర్ - ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజెపి),
వినోద్ కోడూరు , సురేష్ , రామ్ వేముల , శ్రీకాంత్ , హేమచంద్ర, ఆనంద్ జైన్ , ఆర్పీ సింగ్ తదితరులు ఉన్నారు.