వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15వ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్: ఆరవ రోజు ప్రధాన ఆకర్షణలు ఇవే..

Google Oneindia TeluguNews

15వ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆరవ రోజున, భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ వైరుధ్యాలు, డేటా జర్నలిజంతో పాటు మరిన్ని అంశాలు సాహిత్య మహోత్సవంలో అలరించనున్నాయి. ప్రముఖ గ్లోబల్ అడ్వయిజర్ మాకేస్ భౌగోళిక రాజకీయాలు మరియు టెక్నాలజీపై మాజీ దౌత్యవేత్త నవతేజ్ సర్నతో చర్చిస్తారు. జియోపాలిటిక్స్ ఫర్ ది ఎండ్ ఆఫ్ టైమ్: ఫ్రమ్ ది పాండమిక్ టు ది క్లైమేట్ క్రైసిస్ అనే పుస్తకంపై మాట్లాడతారు.

Recommended Video

JLF 2022 : Remo Fernandes In Conversation With Sanjoy K. Roy | Oneindia Telugu

డేటా జర్నలిజం రంగంలో ప్రముఖ వ్యక్తి రుక్మిణి ఎస్ మరియు మాజీ దౌత్యవేత్త లక్ష్మీపూరీలు కలిసి ఆర్థికవేత్త శైలేంద్ర రాజ్ మెహతాతో చర్చిస్తారు. రెండు దశాబ్దాల పాటు గ్రౌండ్ రిపోర్టింగ్ పై తన అనుభవాలను రుక్మిణి ఈ సందర్భంగా పంచుకుంటారు.తాను రాసిన హోల్ నంబర్స్ అండ్ హాఫ్ ట్రూత్స్: వాట్ డేటా క్యాన్ అండ్ కెనాట్ అనే పుస్తకంలో తన అనుభవాలను రాసుకొచ్చారు. ఇప్పుడు ఇవే అంశాలపై ఆమె చర్చిస్తారు.మరో స్పీకర్ లక్ష్మీ పూరీ స్వతహాగా అడ్వకేట్ ,మానవహక్కుల కార్యకర్త. పర్యావరణ పరిరక్షకురాలు, లింగసమానత్వం, శాంతి భద్రతల అంశాలకు అడ్వకేట్‌గా వ్యవహరిస్తున్నారు.

15th Jaipur Literature Festival: Here are the Prime Attractions of Day 6

ఇక ప్రముఖ సంగీత దర్శకులు రెమో ఫెర్నాండెజ్ తన జీవితంలో మ్యూజిక్, ఆర్ట్, రైటింగ్‌లు ఎలా ప్రభావితం చేశాయో చెబుతారు. రెమో ఫెర్నాండెజ్ ఆత్మకథపై వారు చర్చిస్తారు. యుద్ధం మరియు ప్రపంచం యొక్క వైరుధ్యాల మధ్య మనం శాంతి మనస్తత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి? మనం ఎప్పుడైనా శాంతి గురించి కలలు కనగలమా లేదా దూకుడు ప్రవృత్తి తప్పించుకోలేనిదా? రాష్ట్రం, సమాజం పై మరో సెషన్‌లో చర్చించడం జరుగుతుంది.

5వ రోజు రౌండప్

బుధవారం, ఒక సెషన్‌లో భారతీయ పాప్ గాయని ఉషా ఉతుప్, జర్నలిస్ట్ సృష్టి ఝా మరియు సంగీత విద్వాంసురాలు విద్యా షా "ది క్వీన్ ఆఫ్ పాప్-ది అథరైజ్డ్ బయోగ్రఫీ"పై చర్చించారు.. ఝా ఇంగ్లీష్‌లో అనువదించిన పుస్తకంలో ఆమె ప్రయాణాన్ని చూడటం ఉతుప్‌కి ఎలా అనిపించిందని షా అడిగినప్పుడు, అది నిజంగా చాలా గొప్పగా అనిపించిందని సమాధానం ఇచ్చారు.

15th Jaipur Literature Festival: Here are the Prime Attractions of Day 6

మరో సెషన్‌లో ప్రముఖ విద్యావేత్త ఇంద్రజిత్ రాయ్ రచయిత్ హర్ష మందిర్, ఫిల్మ్ మేకర్, కాలమిస్ట్ రచయిత నటాషా బధ్వార్‌లు పాల్గొని పెరుగుతున్న ఆందోళన మధ్య ఆశనిచ్చే రాజకీయాలపై చర్చించారు.కష్ట సమయాల్లో ఆశ అనేది ఎలాంటి స్వాంతన ఇస్తుందనే అంశంపై మాట్లాడారు.చివరిగా మందేర్ మాట్లాడుతూ చరిత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ చివరికి అది న్యాయంవైపే మొగ్గు చూపుతుందని దానిపై తాను కన్విన్స్ అయినట్లు చెప్పారు.

మీరు కూడా ఈ జైపూర్ లిటరేచర్‌లో పాల్గొనాలంటే Jaipur Literature Festival వెబ్‌సైట్‌ను సందర్శించండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X