పుదుచ్చేరి రాజకీయాల్లో Dock Consultancy సరికొత్త విప్లవం..!!
ఒకప్పుడు రాజకీయాలంటే కేవలం కుల సమీకరణలు, ప్రాంతీయత ఆధారంగా సాగాయి. కాని ఇప్పుడు భారత రాజకీయాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. మార్పువైపు వడివడిగా అడుగు వేస్తున్నాయి. డేటా, వ్యూహాత్మక సందేశాలు, ప్రొఫెషనల్ కన్సల్టింగ్ టీమ్స్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అయితే ఈ మార్పును మరింత నిర్మాణాత్మకంగా మార్చింది మాత్రం డాక్ కన్సల్టింగ్ అనే చెప్పుకోవాలి. పుదుచ్ఛేరి రాజకీయ ముఖచిత్రంపై ఈ సంస్థ సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తోంది. లచ్చియ జననాయగ కచ్చి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ నిర్మాణాత్మకమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.
డాక్ కన్సల్టింగ్ కేవలం ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికే పరిమితం కాలేదు. అంతకు మించి ఆలోచించింది. అభ్యర్థుల గెలుపుతో పాటు పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. పుదుచ్చేరిలో లచ్చియా జననాయగ కచ్చి పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ పార్టీకి బలమైన నాయకత్వాన్ని, క్యాడర్ ను నిర్మిస్తూ తిరుగులేని శక్తి మలుస్తోంది. సంప్రదాయ పొలిటికల్ కన్సల్టెన్సీలకు భిన్నంగా పనిచేస్తూ రాజకీయాలను సమాజహితంగా మార్చేందుకు ప్రయత్నిస్తూ అందరి ప్రశంసలను పొందుతోంది.

ముఖ్యంగా నాలుగు సూత్రాల ఆధారంగా డాక్ కన్సల్టింగ్ పని చేస్తోంది. అందులో మొదటిది క్షేత్రస్థాయిలో సమర్ధులైన నాయకులను నియమించడం. రెండోది నాయకులను, కార్యకర్తలను క్రియాశీల రాజకీయాల్లో భాగస్వాములను చేయడం. ఇక మూడోది నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అంచనాలను రూపొందించడం. నాలుగోది నాయకత్వ లక్షణాలు కలిగిన వారికి తగిన పదవీ బాధ్యతలను కల్పించి వారికి పదోన్నతిని ఇవ్వడం. దీన్నే డాక్ కన్సల్టెన్సీ 3A (Appoint, Activate, Asses)+E (Elevate)గా అభివర్ణిస్తోంది. ఈ వవిధానంలో అతి తక్కువ కాలంలో 75వేల మందికి పైగా క్రియాశీలక సభ్యులను పార్టీలో చేర్చినట్లు డాక్ చెబుతోంది.
పుదుచ్చేరిలో లాటరీ కింగ్ గా పేరొందిన శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ నాయకత్వంలోని లచ్చియా జననాయగ కచ్చి పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ వ్యూహాన్నే సంస్థ అనుసరించింది. సంస్థ అందించిన పర్సెప్షన్ మ్యాపింగ్, నియోజకవర్గ స్థాయి అధ్యయనాలను జోస్ చార్లెస్ మార్టిన్ సమర్థవంతంగా అమలు చేస్తుండడం ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలపరిచింది. నిత్యాన్నదానం, స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వర స్పందన చార్లెస్ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో పార్టీకి బలమైన పునాదిని డాక్ నిర్మించింది. అది ఎంతలా ప్రభావం చూపిందంటే.. పార్టీ స్థాపించిన కేవలం రెండు నెలల్లోనే నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA)లో లచ్చియా జననాయగ కచ్చి భాగస్వామిగా చేరింది. ఇది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతమైన పరిణామంగా చెప్పవచ్చు.
డాక్ కన్సల్టింగ్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ తమ ఆలోచన కేవలం ఎన్నికల్లో గెలుపు ఓటములకే పరిమితం కాదంటున్నారు. భవిష్యత్తులో సమర్థులైన పరిపాలకులను వ్యవస్థకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేస్తున్నారు. రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్ ద్వారా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని, వ్యూహాలను రచిస్తామని చెబుతున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు డాక్ కన్సల్టింగ్ నిర్మాణాత్మక విధానాలను ప్రశంసిస్తున్నారు. ఇదే తీరున ముందుకు సాగితే లచ్చియా జననాయగ కచ్చి-డాక్ కన్సల్టింగ్ ప్రస్థానం భారత రాజకీయ ముఖ చిత్రంపై కొత్త ఒరవడిని సృష్టిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications