వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపూర్ లిటరే,ర్ ఫెస్టివల్: 8వ రోజున ముఖ్యమైన టాపిక్స్ ఇవే..!

Google Oneindia TeluguNews

శనివారం రోజున జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌ 8వ రోజు ప్రారంభం అవుతుంది. ఈ రోజున మంచి స్పీకర్లు పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ఇందులో భాగంగా మ్యూటినీ ఆఫ్ ది రాయల్ ఇండియన్ నేవీ పై చర్చిస్తారు. అంతేకాదు స్వాతంత్ర్యం వచ్చాక రాజకీయ శక్తులు, ప్రపంచీకరణ, దక్షిణ భారత దేశం యొక్క సంస్కృతి పై చర్చించడం జరుగుతుంది.

Recommended Video

JLF 2022 : Paramita Satpathy And Anukrti Upadhyay In Conversation With Saket Suman | Oneindia Telugu

రోలీ బుక్స్ వ్యవస్థాపకులు మరియు పబ్లిషర్ ప్రమోద్ కపూర్ భారతీయ వారసత్వం గురించి మాట్లాడతారు. చరిత్రకారుడు శ్రీకాంత్ కెస్‌నూర్ మరియు న్యూస్ 9 + ఎడిటర్ మరియు రచయిత సందీప్ ఉన్నితాన్ రాసిన పుస్తకం 1946 పై చర్చిస్తారు.భారత స్వాతంత్ర్య సమయంలో గుర్తింపు పొందని కొన్ని ఘట్టాలను వివరిస్తారు.

Jaipur Literature Festival: Here are the topics in focus on Day 8

లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్ రచయిత అనిరుధ్ కనిసెట్టి, మను ఎస్ పిల్లయ్‌తో మాట్లాడతారు. పిల్లయ్ రెబెల్ సుల్తాన్స్ పుస్తకం రాశారు. వీటితో పాటు చరిత్రకు సంబంధించిన మరిన్ని పుస్తకాలు ఆయన రాశారు. కనిసెట్టి రాసిన లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్: సదరన్ ఇండియా ఫ్రమ్‌ ది చాలుక్యాస్ టు ది చోలాస్ అనే పుస్తకం దక్షిణ భారత దేశాన్ని ఏలిన రాజుల గురించి వివరిస్తుంది. వారి భిన్న సంస్కృతులను హైలైట్ చేస్తుంది. రచయిత మరియు బైయో కెమిస్ట్ ప్రణయ్ లాల్ తాను రాసిన పుస్తకం ఇన్‌విసిబుల్ ఎంపైర్ ద్వారా ప్రపంచాన్ని కుదిపేస్తున్న వైరస్‌ల గురించి ప్రస్తావించారు. ఈయన మరో రచయిత ప్రముఖ విద్యావేత్త సర్జన్ అయినటువంటి అంబరీష్ సాత్విక్‌తో వైరస్ టాపిక్‌లపై చర్చిస్తారు.

7వ రోజు రౌండప్
ఏడవ రోజున జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముందుగా లిండ్సే పెరియర్, జర్నలిస్ట్ మరియు ఎడిటర్ రిజులా దాస్, రైటర్ షబీర్ అహ్మద్ మీర్ మరియు దారిభా లిండెంలు మరో రచయిత కరుణ ఇజ్రా పారిఖ్‌తో పలు పుస్తకాలపై చర్చించారు. ఏడవ రోజు ఉదయం కార్యక్రమం ప్రాణయామ యోగా ఇన్స్‌ట్రక్టర్ సునీల్ తల్వాల్‌తో ప్రారంభమైంది. యోగాసనాలతో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాదు అక్కడకు చేరివచ్చిన వారికి పలు శ్వాస వ్యాయామాలు నేర్పారు. ఆ తర్వాత మంచి సంగీతం ఆహుతులను అలరించింది. వోకలిస్ట్ ఆస్త గోస్వామి ప్రదర్శన ఆకట్టుకుంది.

Jaipur Literature Festival: Here are the topics in focus on Day 8

నటుడు జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్‌పేయి ప్యానెల్‌లో ఉండి పలు అంశాలపై చర్చించారు.మరో రచయిత జాతీయ పురస్కార గ్రహీతతో చర్చలో పాల్గొన్నారు. ఇక ఇలాంటి ఫెస్టివల్‌లో మీరూ పాల్గొనాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు Jaipur Literature Festival వెబ్‌సైట్‌ను సందర్శించండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X