ప్రియుడి పురుషాంగాన్ని కోసిన స్త్రీ: జీర్ణించుకోలేక..

Kadapa Map
కడప: ఓ వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని కోసిన సంఘటన కడప జిల్లాలో జరిగింది.
భర్త పోయి ఏడేళ్లయింది. మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ యువకుడికీ పెళ్లి నిశ్చయమైంది. శుభలేఖ పట్టుకుని పిలవడానికి వచ్చాడు. దానిని జీర్ణించుకోలేని ఆ మహిళ తనతో ఆ యువకుడి మర్మాంగాన్ని కోసేసింది.

కడప జిల్లా వల్లూరు మండలం రామిరెడ్డి కొట్టాలులో ఈ ఘటన జరిగింది. వల్లూరు ఎస్సై కథనం ప్రకారం.. రామిరెడ్డి కొట్టాలకు చెందిన మహిళ భర్త ఏడేళ్ల కిందట మరణించాడు. తర్వాత ఆమెకు రైల్వే కొండాపురానికి చెందిన రవీంద్రతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటినుంచి వారి బంధం కొనసాగింది.

అయితే, ఇటీవలే రవీంద్రకు వివాహం నిశ్చయమైంది. దీంతో ఆమెను ఆహ్వానించేందుకు శుభలేఖలు పట్టుకుని రవీంద్ర బుధవారం ఆమె ఇంటికి వచ్చాడు. తనతో సంబంధం నెరపుతున్న రవీంద్ర మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. రవీంద్రతో గొడవపడింది.

చివరకు సర్దుబాటు చేసుకున్న తర్వాత ఆ రాత్రికి ఆమె ఇంట్లోనే రవీంద్ర బసచేశాడు. రవీంద్ర నిద్రపోతున్న సమయంలో ఆమె అతని మర్మాంగాన్ని కత్తితో కోసింది. ముందస్తు వ్యూహంలో భాగంగా వెంటనే తలకు పూసుకొనే రసాయనం తాగింది. ఆ తర్వాత ఒకరిమీద మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ 108 వాహనంలో రిమ్స్‌కు తరలించి కేసును దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions