మిత్రులతో కలిసి అత్తను రేప్ చేసిన మేనల్లుడు, అరెస్టు

వివరాలు ఇలా ఉన్నాయి - బ్రాహ్మణకొట్కూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స పొందుతున్న బంధువులను చూడడానికి కర్నూలు జిల్లా ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. గురువారం రాత్రి భోజనం పెట్టిస్తానని చెప్పి మేనల్లుడు ఆటోలో బయటకు తీసుకుని వెళ్లాడు. మార్గమధ్యంలో మరో నలుగురిని ఆటోలో ఎక్కించుకున్నాడు.
ఆటోను గుత్తి పెట్రోల్ బంకు వైపు తీసుకుని వెళ్లి, బంకు దాటిన తర్వాత వారంతా మహిళను ముళ్ల పొదళ్లోకి తీసుకుని వెళ్లి రేప్ చేశారు. తీవ్రంగా గాయపరిచారు. మళ్లీ వాహనంపై ఆమెను తీసుకుని వచ్చి ఆస్పత్రి ఆవరణలో పడేశారు. బాధితురాలని గమనించిన వారు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.
శుక్రవారం సాయంత్రానికి ఆమె తేరుకుంది. విషయమంతా ఆమె అప్పుడు వివరించింది. ఈ దారుణ సంఘటనపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. అత్యాచారానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి.












Click it and Unblock the Notifications