యువతిపై రేప్: ఆటో నుంచి దూకేసిన అమ్మాయి

మెదక్ జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ప్రకాశం జిల్లా పర్చూరు వద్ద పాలిటెక్నిక్ విద్యార్థినిని అపహరించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఆటో ఎక్కిన యువతికి ఆటోడ్రైవర్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో ఆమె ఆటోలోంచి దూకింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ డిఐజి కార్యాలయం ముందు కానిస్టేబుల్ హైమద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైమద్‌ను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని స్థితి ఆందోళనకరంగా ఉంది.
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం అరె సముద్రం గ్రామంలో తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications