మహిళను రేప్ చేసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. లారీ-మినీ వ్యాన్ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతులను హైదరాబాద్ కొంపల్లి వాసులుగా గుర్తించారు. కాళేశ్వరం పుష్కరాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
మరో ప్రమాదంలో ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై స్కార్పియో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో జెర్సీ మిల్కీ డైరెక్టర్ ఉపేందర్‌రెడ్డితో పాటు ఆయన అత్తా, మామయ్య ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications