పేరెంట్స్ దాష్టీకం: వ్యభిచారం చేయాలని కూతురిపై ఒత్తిడి

రెండో భార్యతో కలిసి అతను పదోతరగతి చదివిన కూతురిని వ్యభిచారం రొంపిలోకి దించాలని ప్రయత్నించారు. దీంతో ఆమె ఇంటినుంచి పారిపోయి హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో తలదాచుకుంది. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులను పీఐటీ చట్టం కింద అరెస్టుచేశారు.
అప్పుల బాధతో మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన రైతు కొప్పాల నాగులు (30) వరుసగా దిగుబడులు దెబ్బతినడంతో సాగు కోసం చేసిన అప్పులు పెరిగి పోయాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో మనస్తాపం చెందిన నాగులు సోమవారం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన రైతు పంజాల సమ్మయ్య (42) తనకున్న మూడెకరాల్లో సాగు కోసం అప్పులు చేశాడు. మూడేళ్లుగా వరుసగా దిగుబడులు దెబ్బతినడంతో పాటు గతేడాది తన పొలంలో బావి తవ్వడం కోసం చేసిన అప్పులు కలసి మోపెడయ్యాయి. ఈ ఖరీఫ్‌లో వరి నాట్లు వేసిన సమయ్యకు రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో సమయ్య సోమవారం తన పొలంలోనే పురుగుల మందు తాగాడు.












Click it and Unblock the Notifications