దారుణం: మహిళపై సామూహిక అత్యాచారం, హత్య
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన దుండగులు, ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. జూన్ 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
మచిలీపట్నం శివారులో స్వర్ణలత అనే మహిళను బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ తోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

స్వర్ణలతకు ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌తో ఇంతకుముందే పరిచయం ఉందని, పెళ్లికి ముందే వీళ్లు ఆమెకు తెలుసని పోలీసులు తెలిపారు. అప్పుడప్పుడు అతడికి ఆమె డబ్బులు సర్దుబాటు చేసేవారని చెప్పారు. కాగా, ఆమెకు మూడేళ్ల క్రితం విశాఖపట్నానికి చెందిన యువకుడితో పెళ్లయిందని, ఒక కొడుకు ఉన్నాడని తెలిపారు. సెలవులు కావడంతో కొడుకుతోపాటు ఇక్కడికి వచ్చిన స్వర్ణలతను శ్రీనివాస్ మరోసారి డబ్బులు అడిగాడు.
కొడుకు సహా ఆమెను మచిలీపట్నం శివారు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నగలు తీసకున్న తర్వాత.. శ్రీనివాస్, అతడి మరో ఇద్దరు స్నేహితులు ఆమెపై అత్యారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే హత్య చేశారు. ఆమె కొడుకును మచిలీపట్నంలో వదిలేశారు. కాగా, కుటుంబ సభ్యులు స్వర్ణలత కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications