జర్మన్ యువతిపై చెన్నై రైల్లో అత్యాచారం, అరెస్టు

తనపై అత్యాచారం జరిగిన మూడు రోజుల తర్వాత యువతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై వైద్యపరీక్షలు నిర్వహించారు. నివేదికలు రావాల్సి ఉంది. మంగళూర్ నుంచి చెన్నై వెళ్తున్న రైలులో నిద్రిస్తుండగా జర్మన్ యాత్రికురాలిపై లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఓ ఎన్జీవో కోసం పనిచేయడానికి ఆమె చెన్నై వచ్చింది. తాము నిందితుడిని అరెస్టు చేశామని, అత్యాచారం కింద కేసు నమోదు చేశామని పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ సీమా అగర్వాల్ ఎన్డీటివీతో చెప్పారు. తనపై లైంగిక దాడి జరిగినప్పుడు గట్టిగా అరవడానికి కూడా ధైర్యం చాలలేదని ఆమె పోలీసులకు చెప్పింది.
పోలీసులకు ఫిర్యాదు చేయడానికి జర్మన్ యాత్రికురాలు ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చిందని, అందుకే ఆలస్యంగా ఫిర్యాదు చేసిందని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications