రేవంత్ సర్కార్ రికార్డు: రైతు భరోసా నిధుల పంపిణీలో సరికొత్త మైలురాయి!
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు అండదండగా ఉండడానికి అన్ని విధాలా చర్యలు చేపడుతుంది. రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం పంట పెట్టుబడిసాయం అందించే రైతు భరోసా విషయంలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. గత బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో రైతుబంధు గా ప్రారంభమైన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం రైతు భరోసాగా కొనసాగిస్తోంది.
రైతు భరోసా నిధుల పంపిణీ ఏకంగా 46శాతం పెరుగుదల
ప్రస్తుతం ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు అందించిన మొత్తం నిధుల పంపిణీ ఏకంగా 46 శాతం పెరిగింది. దీంతో ఈ మొత్తం 73,320 కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం 2018లో ఈ పథకం ప్రారంభించినప్పుడు కేవలం భూమి ఉన్న సుమారు 58 లక్షల మంది రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందేది.

రెండేళ్లలో 23,070 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు విడుదల
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పరిధిని మరింత విస్తృతం చేయడంతో కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడంతో ప్రస్తుతం ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య 73లక్షల మార్కును చేరుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లకాలంలో 50,250 కోట్ల రూపాయలు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు తక్కువ కాలంలోనే 23,070 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు విడుదల చేసింది.
అత్యధికంగా నల్గొండ జిల్లాకు 5,491 కోట్లు గరిష్ట నిధులు
ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 9 లక్షల మంది నిరుపేద వ్యవసాయ కూలీలను సైతం చేర్చి వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక భారం పెరిగినప్పటికీ రైతు సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాకు 5, 491 కోట్లు గరిష్ట నిధులు అందాయి.
బోగస్ లబ్ధిదారుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ సర్కార్
ఆ తర్వాత స్థానాలలో సంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా వ్యవసాయ భూములు లేని హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడం కోసం బోగస్ లబ్ధిదారుల ఏరివేత కార్యక్రమాన్ని అధికారులు వివరించారు. సాగులో లేని భూములను ఈ జాబితా నుండి తొలగిస్తున్నారు. ఇక ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల కాగా, విడతలవారీగా ఇవి రైతుల ఖాతాలలో జమ కానున్నాయి.













Click it and Unblock the Notifications