అమరావతి రైతులకు సీఆర్డీఏ శుభవార్తలు..! ఈ సమస్యలన్నంటికీ చెక్..!

ఏపీలో అమరావతి రాజధాని రైతులకు ఇవాళ కూటమి సర్కార్ (AP Govt) మరో శుభవార్త చెప్పింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా ఇస్తున్న కౌలు వివరాలను పారదర్శకంగా బయటపెట్టాలని నిర్ణయించింది. వీటిపై ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో కౌలు వివరాలను రైతులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీఆర్డీఏ అధికారులు ఇవాళ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

అమరావతి నిర్మాణానికై భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతుల కోసం సీఆర్డీఏ కీలక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు అందించే వార్షిక కౌలు(Annuity) చెల్లింపుల స్థితిగతులను పారదర్శకంగా తెలియజేసే ఉద్దేశంతో పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ (https://crda.ap.gov.in/APCRDAV2/views/Annuity_status.aspx)లో అందుబాటులో ఉంచింది. అలాగే రాజధాని గ్రామాలలోని ఎల్పీఎస్ ఆఫీసుల వద్ద కౌలు చెల్లింపు వివరాలను ప్రదర్శించాలని నిర్ణయించారు.

AP Govt to Publish Amaravati Farmers annuity Amount Details Online and Offline
జగన్ మావిగన్ సవాల్ కు స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!
జగన్ మావిగన్ సవాల్ కు స్పందించిన చంద్రబాబు- కీలక వ్యాఖ్యలు..!

అలాగే రైతుల సౌకర్యార్థం ప్రతి యూనిట్ ఆఫీస్ వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి రైతులకు వార్షిక కౌలు చెల్లింపుపై తలెత్తిన సందేహాలను సీఆర్డీయే అధికారులు, సిబ్బంది వివరిస్తారు. దీంతో పాటు ప్రతీ సోమవారం రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో రైతుల NPCI/ బ్యాంక్ లింకేజి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకుగాను హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ ద్వారా సీఆర్డీయే సిబ్బంది..పలువురు రైతులకు NPCI లింకేజి ప్రక్రియ పూర్తి చేస్తారు.

అమరావతి ఎయిర్ పోర్ట్ రాకతో గన్నవరం క్లోజ్ ? సర్కార్ క్లారిటీ..!
అమరావతి ఎయిర్ పోర్ట్ రాకతో గన్నవరం క్లోజ్ ? సర్కార్ క్లారిటీ..!

ఏపీసీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారంలో వార్షిక కౌలు జమ అయిన రైతుల వివరాలతో పాటు, ఇంకా కౌలు జమ కాని రైతుల వివరాలు, చెల్లింపులు నిలిచిపోవడానికి గల కారణాలను సైతం వెల్లడించనున్నారు. అలాగే NPCI (National Payments Corporation of India) వ్యవస్థలో ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలను కలిగిన రైతుల జాబితాను సైతం ఉంచుతారు. రాజధాని రైతులకు కౌలు చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్న నేపథ్యంలో, NPCI లింకేజీ సక్రమంగా లేకపోవడం లేదా బ్యాంకు ఖాతాలు ఇనాక్టివ్‌గా ఉండటం వంటి కారణాల వల్ల కొందరికి చెల్లింపులు జమ కావడం లేదు. అలాంటి రైతులు తమ ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలని సీఆర్డీయే సూచించింది.

AP Govt to Publish Amaravati Farmers annuity Amount Details Online and Offline

అలాగే రైతులు తమ వార్షిక కౌలు చెల్లింపు స్టేటస్ సులభంగా తెలుసుకునేందుకు సీఆర్డీఏ ఓ QR కోడ్‌ను విడుదల చేసింది. ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత వెబ్‌పేజీలో రాజధాని రైతులు తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే కౌలు లబ్ధి సమాచారం తెలుసుకునే సౌకర్యం కల్పించారు. కౌలు లబ్ధి పొందని రైతులు తమ పేర్లు, ఖాతా వివరాలు.. ఏ కారణం చేత కౌలు జమ కాలేదోనన్న అంశాలను సైతం చెక్ చేసుకోవచ్చు. ఆధార్ ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంక్ ఖాతాలలో కౌలు నగదు జమ చేయడం సాధ్యపడదు కాబట్టి ఆధార్ ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలు కలిగిన రైతులు వెంటనే ఆ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+