పవన్, రావణ్ మధ్య తేడా అదొక్కటే...! సీపీఐ నారాయణ షాకింగ్..!

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna Ravan) ను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా వరుసగా నాలుగు కేసుల్లో రావణ్ ను అరెస్టు చేయడం, బెయిల్ రావడం జరగడంతో చేసేది లేక బెయిల్ రాని ఉపా కేసు పెట్టి జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలకూ, ఇప్పుడు రావణ్ ఆయనపై చేసిన వ్యాఖ్యకూ మధ్య పోలికపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ (CPI Narayana) పవన్ కళ్యాణ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్షంలో ఉంటూ చేసిన వ్యాఖ్యలకూ, ఇప్పుడు రావణ్ చేసిన వ్యాఖ్యలకూ పెద్దగా తేడా ఏమీ లేదని స్పష్టం చేశారు. అప్పట్లో ఇంకా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై చెప్పులు చూపించారంటూ నారాయణ గుర్తుచేశారు. రావణ్ అలా చేయకపోయినా ఆయన్ను వరుసగా అరెస్టులు చేయడం, ఉపా కేసులు పెట్టి జైలుకు పంపడం దారుణమని నారాయణ తెలిపారు.

CPI Narayana Draws Sharp Comparison Between Pawan Kalyan and YouTuber Prasna Ravan

రావణ్ ను ప్రస్తుతం ఉపా చట్టం కింద అరెస్టు చేశారని, అతను చేసిన పనేంటి ? అని నారాయణ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన డైలాగ్ సేమ్ టూ సేమ్ చెప్పాడు, పవన్ చెప్పు చూపించాడు, రావణ్ చూపించలేదు అంతే అన్నారు. బెయిల్ వస్తే మళ్లీ అరెస్టు చేస్తున్నారని, పోలీసు స్టేషన్లో ఉన్న రావణ్ పై జనసేన కార్యకర్తలు దాడి చేయడం ఏంటి , అదేమైనా టీడీపీ ఆఫీసా, జనసేన ఆఫీసా అని నారాయణ ప్రశ్నించారు.

CPI Narayana Draws Sharp Comparison Between Pawan Kalyan and YouTuber Prasna Ravan

ఈ మధ్య మహారాష్ట్రలో హైకోర్టు ఓ తీర్పు ఇచ్చిందని, మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ అంటే అరెస్టు చేస్తారా అని న్యాయమూర్తి ప్రశ్నించారని నారాయణ గుర్తుచేశారు. ఇదేమైనా నియంత పాలన అనుకున్నారా అని జస్టిస్ మాధవ్ అడిగారన్నారు. రాష్ట్రంలో స్టేషన్లో లాకప్ డెత్ చేసి బూడిద మాయం చేశారని, రాష్ట్రం ఎటువైపు పోతోందని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం వచ్చినా రాజకీయ ప్రత్యర్ధులపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. రాజకీయ వ్యవస్ధలో ఓ అరాచకం కనిపిస్తోందిని, అదీ అధికార పక్షం నుంచే వస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాల తీరును ఖండించిన నారాయణ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+