అమ్మాయిపై గ్యాంగ్ రేప్: ప్రేయసిపై హత్యాయత్నం

మరుసటి రోజు బాలిక ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. మధు అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని, అతని స్నేహితుడు రాహుల్, క్యాబ్ డ్రైవర్‌లు కూడా అత్యాచారం జరిపారని తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సమీక్షించి, వైద్యపరీక్షల నిమిత్తం బాలికలను ఆస్పత్రికి తరలించారు.
ఇదిలావుంటే, ప్రేమపేరుతో విద్యార్థినిని నమ్మించి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఆమెపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం నల్లగొండలో జరిగింది. చండూరు మండలం కుర్రంపల్లికి చెందిన తలారి అరుణ (21) నిట్స్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. ఆమె సోదరిని కనగల్ మండలం దర్వేశిపురానికి చెందిన యువకుడికి ఇచ్చి విహహం జరిపించారు.
అరుణ తన అక్క కోసం తరచూ దర్వేశిపురానికి వచ్చేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ నకిరేకంటి సైదులుతో పరిచయం ప్రేమగా మారింది. సైదులుకు గతంలోనే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఈ విషయం తెలియని అరుణ అతని ప్రేమలో పడి తననూ పెళ్లి చేసుకోవాలని సైదులుపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
మంగళవారం అరుణ సైదులు నడిపే ఫైనాన్స్ దుకాణానికి వెళ్లగా ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి హత్యాయత్నం చేశాడు. 95 శాతం శరీరం కాలిన ఆమెను నలుగురు యువకులు ఆటోలో నల్లగొండ ఆస్పత్రిలో వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications