అసహజమైన రతి, అత్యాచారం: భర్తపై భార్య ఫిర్యాదు

Woman accuses husband of rape
న్యూఢిల్లీ: వివాహానంతరం థాయ్‌లాండ్ దేశానికి హనీ‌మూన్‌కు వెళ్లిన సందర్భంగా తనపై తన భర్త దారుణమైన అత్యాచారాలకు పాల్పడ్డాడని 23ఏళ్ల మహిళ ఢిల్లీ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు బాధితురాలి భర్త పునీత్ భరద్వాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అసహజమైన సెక్స్‌ కోసం తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.

ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. లైంగికంగా తీవ్రంగా వేధించినట్లు నిర్ధారణ కావడంతో బాధితురాలు తన మెడికల్ రిపోర్టులను కూడా తమకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త బహుళజాతి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు కూడా ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వహిస్తోంది.

బాధితురాలికి, పునీత్‌కి నవంబర్ 29న వివాహమైందని పోలీసులు చెప్పారు. అనంతరం వీరిద్దరూ బ్యాంకాక్‌కు వారంపాటు(డిసెంబర్ 1 నుంచి 8 వరకు) హనీమూన్ వెళ్లి వచ్చారు. ఈ పర్యటనలో పునీత్ భరద్వాజ్ తనపై దారుణమైన అత్యాచారాలకు, అసహజ రతికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. దీని వల్ల తను శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురయ్యానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

తను మాల్దీవులకు వెళ్దామంటే.. తన భర్త బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడని తెలిపింది. తనతో అతను ప్రవర్తించిన తీరును తన తల్లిదండ్రులకు తెలిపానని, వారు పోలీసులను సంప్రదించాలని కోరడంతో పోలీసులకు వారితో కలిసి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది. విచారణ ప్రారంభించిన పోలీసులు, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, పలు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions